Mohanlal : మలయాళ సినీ పరిశ్రమలో అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ నటించడం మాత్రమే కాకుండా, తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బరోజ్‌’. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మోహన్‌లాల్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు.
తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో, ‘బరోజ్‌ తన రహస్యాలను బయపెట్టడానికి రాబోతున్నాడు. అక్టోబరు 3న సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది.

ఈ పోస్టర్‌తో పాటు మోహన్‌లాల్‌, బరోజ్‌ అనే జీనీ తరహా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. మోహన్‌లాల్‌ నటన, దర్శకత్వం రెండింటితో కూడిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దీపావళి కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ‘బరోజ్‌’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!