Raviteja : మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. షాక్ , మిరపకాయ్ చిత్రాల తర్వాత ఇద్దరి కాంబోలో రాబోతున్న మూడో సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా జెట్ స్పీడ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. ఇంత వరకు ఈ సినిమా లక్నో, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా తదుపరి మేజర్ షెడ్యూల్ యునైటెడ్ స్టేట్స్‌లో జరుగుతుంది.

తాజా అప్‌డేట్ ఏమిటంటే.. మిస్టర్ బచ్చన్ బృందం ఈ వారం అమెరికాకు వెళ్లనుంది. యూఎస్ షెడ్యూల్‌లో పాటలు, కీలకమైన టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తారని యూనిట్ తెలిపింది. రవితేజ, యారియాన్ 2 ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే.. ఇతర ప్రధాన నటీనటులు రాబోయే షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. అజయ్ దేవ్ గన్ తదితరులు నటించిన రైడ్ సినిమాకిది అఫీషియల్ రీమేక్.

Leave a comment

error: Content is protected !!