Mirzapur 3 : అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన “మీర్జాపూర్” వెబ్ సిరీస్ భారీ విజయం సాధించింది. ఇప్పటికే రెండు సీజన్లు వచ్చి ప్రేక్షకులను అలరించగా, మూడో సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా, సిరీస్ బృందం సీజన్ 3 టీజర్‌ను విడుదల చేస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ టీజర్‌లో పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, విజయ్ వర్మ కీలక పాత్రల్లో కనిపించారు.

“ఎంత వేగంగా పరుగెత్తే చిరుత కూడా సింహం పదునైన గోళ్లకు సరిపోదు”, “గాయపడిన సింహం మళ్లీ వచ్చింది. బలవంతులు మాత్రమే ఈ అడవిలో జీవించగలరు” వంటి డైలాగ్‌లతో ఈ టీజర్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. అధికారం, ప్రతీకారం, రాజకీయాలు వంటి అంశాలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సీజన్ రూపొందించబడింది. ముందు సీజన్ల కంటే ఈ సీజన్ మరింత రసవత్తరంగా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. “మీర్జాపూర్ 3” చిత్రీకరణ పూర్తి అయింది, జులై 5 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Leave a comment

error: Content is protected !!