Mirzapur : ఇండియన్ ఓటీటీ ప్రేక్షకుల్లో అత్యధికులకు సుపరిచితం అయిన వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’. ఇప్పటి వరకు రెండు సీజన్‌లు వచ్చిన మీర్జాపూర్ మూడో సీజన్‌కి సిద్ధం అయ్యింది. షూటింగ్‌ పూర్తి చేసిన మేకర్స్‌ అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

మీర్జాపూర్ స్ట్రీమింగ్‌ అయిన ప్రతి సారి ఒక వర్గం ప్రేక్షకులు తీవ్రంగా విమర్శలు గుప్పించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వెబ్ సిరీస్‌కు సెన్సార్ అవసరం అని, యువత చెడి పోయే విధంగా ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుంది అంటూ వారు ఆందోళన చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

బూతు వెబ్‌ సిరీస్‌కు ఇప్పటికే పేరు పడిపోయింది. అలాంటి బూతు వెబ్‌ సిరిస్ కి ఇప్పుడు మూడో సీసన్ వస్తోంది. ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తుండగా, ఈ సీజన్‌లో మున్నా భయ్యా పాత్ర కనిపిస్తుందా లేదా అనేది టెన్షన్‌గా మారింది. మరి ఈ సిరీస్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!