ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్నా మనుషుల్ని కలుపుతోంది.. బంధాల్ని బలంగా చేస్తోంది. మానవతను తట్టిలేపుతోంది. కరోనాపై యుద్ధానికి ప్రపంచమంతా ఒకే తాటిపైకి రావాలనుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్ళూ పాన్ ఇండియా సినిమాకోసమే కలుస్తున్న బడా స్టార్లు.. ఇప్పుడు కరోనా పై యుద్ధం కోసం కలిసి ముందుకు సాగారు. అందు కోసం ఏకంగా ఒక లఘు చిత్రంలో నటించడం విశేషం. కరోనా ఎంతటి ప్రమాదకరమో, ఇంట్లో ఉండడం ఎంత సురక్షితమో  చాటిచెప్పేందుకే ఈ లఘుచిత్రం.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్… టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి .. సూపర్ స్టార్ రజనీకాంత్., మాలీవుడ్ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్, బాలీవుడ్ యంగ్ హీరోలు రణబీర్ కపూర్, దిల్జిత్ దోసంజ్ , ప్రియాంక చోప్రా- ఆలియా భట్ తదితరులు నటించారు.  దర్శకుడు ప్రసూన్ పాండే.. సోని పిక్చర్స్  కలిసికట్టుగా  `కుటుంబం` (ఫ్యామిలీ) పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్ ని రూపొందించారు.  ప్రజలంతా ఇంట్లోనే సురక్షితంగా ఉండడం.. పరిశుభ్రత పాటించడం.. ఇంటి నుండి పని చేయడం .. సామాజిక దూరాన్ని కొనసాగించడం వగైరా మంచి విషయాల్ని అందరికీ తెలియజేశారు. `ఫ్యామిలీ` పేరు తో ఈ లఘు చిత్రం సోనీ నెట్ వర్క్లో సోమవారం రాత్రి 9 గంటలకు ప్రదర్శితమయింది. వియ్ ఆర్ వన్ అనే స్లోగన్ తో సాగే చిత్రమిది. అమితాబ్ జీ నల్ల కళ్ళద్దాలు  కనిపించవు. దాంతో దిల్జిత్ రోసంజా అందరు స్టార్స్ ను దాని గురించి అడుగడమే ఈ షార్ట్ ఫిల్మ్. దీని   ద్వారా దేశవ్యాప్తంగా లక్ష గృహాలకు నెలవారీ రేషన్ కి సరిపడే నిధుల్ని సేకరించాలన్నది ప్లాన్. కార్మికుల్లో కనీసం ఒక నెల పాటు గృహ సామాగ్రిని అందించాలన్నది సోనీ పిక్చర్స్ సంకల్పం అని చెబుతున్నారు. మరి ఈ షార్ట్ ఫిల్మ్ ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!