Meenakshi Chowdary : ప్రస్తుతం టాప్ సినిమాల్లో నటిస్తూ .. దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి.. వచ్చే ఏడాది టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, “హిట్ 2″తో మంచి విజయం సాధించింది.

ఆమె నటించిన పాన్ ఇండియా చిత్రాలు “GOAT” (విజయ్‌కి జోడీగా) “లక్కీభాస్కర్” (దుల్కర్ సల్మాన్‌ కు జోడీగా) సెప్టెంబర్ 5 , 7 తేదీల్లో వరుసగా విడుదల కాబోతున్నాయి. అక్టోబర్ 31న విశ్వక్ సేన్‌తో కలిసి నటించిన “మెకానిక్ రాకీ”, వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి కాంబో మూవీ కూడా విడుదలవుతాయి. వరుణ్ తేజ్‌తో “మట్కా” చిత్రంలోనూ నటిస్తోంది మీనాక్షి.

ఈ అవకాశాల గురించి మీనాక్షి చాలా సంతోషంగా ఉంది. “ఇవన్నీ దేవుడి దయే. నేను చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడం చాలా సంతోషంగా ఉంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ నటించే అవకాశం నాకు దక్కడం చాలా అదృష్టం” అని ఆమె అన్నారు.
మెరుగైన కథలు, పాత్రలతో, తన నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి మీనాక్షి చౌదరి కృషి చేస్తూనే ఉంది. ఖచ్చితంగా ఈ యువ నటి భవిష్యత్తులో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుందని ఆశిద్దాం.

Leave a comment

error: Content is protected !!