Meenakshi Chowdary : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, వరుస అవకాశాలు దక్కించుకోవడం మరో ఎత్తు. ఇందులో సక్సెస్ రేటు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి అలాంటి దశలో ఉన్నారు. స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఆమెకు అనుకున్న స్థాయిలో విజయం దక్కలేదు.

మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ చిత్రంలో నటించిన మీనాక్షి, తన పాత్ర చాలా తక్కువగా ఉందని ఫీల్ అయ్యింది. విజయ్‌తో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంలో నెగటివ్ పాత్రకు జోడిగా నటించడం ఆమె కెరీర్‌కు పెద్ద మైనస్ అయ్యింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో నటిస్తున్న మీనాక్షి, ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ధనుష్ ‘సార్’ చిత్రంలో సంయుక్త మీనన్‌ను ఎలా ప్రెజెంట్ చేశాడో, అలాగే మీనాక్షిని కూడా ప్రెజెంట్ చేస్తే ఈ చిత్రం ఆమెకు మంచి బ్రేక్ ఇవ్వవచ్చు.

లక్కీ భాస్కర్ తర్వాత విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ మట్కాలు చిత్రాల్లో నటిస్తున్నారు. విశ్వంభరా చిత్రంలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధికారికంగా ప్రకటన రాలేదు. లక్కీ భాస్కర్ చిత్రం హిట్ అయితే మీనాక్షి చౌదరికి మంచి పునాది పడినట్లవుతుంది.  సో…ఇప్పుడు ఆమె నటిస్తున్న చిత్రాలు ఆమె కెరీర్‌ను నిర్ణయిస్తాయి.

Leave a comment

error: Content is protected !!