ఫిబ్రవరిలో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. ఫిబ్రవరి 2 న రిలీజ్‌ కాబోతున్న మూవీస్‌లో ‘మెకానిక్’ ఒకటి. మణిసాయితేజ. రేఖ నిరోషా జంటగా నటించిన ‘మెకానిక్‌’ చిత్రాన్ని ముని సహేకర దర్శకత్వంలో మున్నా (ఎం నాగ మునెయ్య) నిర్మించారు. ఈ చిత్రం ఆడియో టీ సిరీస్‌ రిలీజ్‌ చేసింది. ఆల్బమ్‌ 10 మిలియన్స్ క్రాస్‌ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆడియో సక్సెస్‌ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సినిమా పట్ల ప్యాషన్‌తో మంచి జీతం ఇచ్చే జాబ్‌ను వదులుకుని సినీ రంగంలో అడుగుపెట్టారు నిర్మాత మున్నా. ఇంతటి రిస్క్ తీసుకుని మెకానిక్ చిత్రం నిర్మించారు. ఏదైనా తేడా వస్తే కెరీర్‌ మొత్తం బోల్తా కొడుతుంది .అయితే మెకానిక్‌ మూవీ ఆల్బమ్‌ మంచి సక్సెస్‌ కావడంతో పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లయిందన్నారు నిర్మాత మున్నా.

Leave a comment

error: Content is protected !!