చిత్రం: “మయూరాక్షి”
నటి నటులు: ఉన్ని ముకుందన్, మియా జార్జ్, గోకుల్ సురేష్, మియా, లేనా, నిరంజనా, శంకర్
దర్శకుడుః సాయిజు ఎస్.ఎస్
నిర్మాతః వరం జయంత్ కుమార్
కో-ప్రొడ్యూసర్ః వరం యశ్వంత్ సాయి కుమార్
సంగీతం: గోపీ సందర్
ఛాయాగ్రహణం:
పాటలుః పూర్ణాచారి
శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై `భాగమతి` ఫేం ఉన్ని ముకుందన్ హీరోగా “మియా జార్జ్” హీరోయిన్ గా రూపొందిన చిత్రం “మయూరాక్షి”. యువ నిర్మాత వరం జయంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సూపర్ హిట్ చిత్రాల సంగీత దర్శకుడు గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించిందో లేదో తెలుసుకుందాం?
కథ:
డాక్టర్ అజయ్ (ఆర్ఫనేజర్) చర్చ్ ఫాదర్ ద్వారా రికమెండేషన్ తో, ఒక పెద్ద హాస్పటల్ లో జూనియర్ డాక్టర్ గా జాయిన్ అవ్వుతాడు. అజయ్ హాస్పటల్ లో కావ్య, తార అనే ఇద్దరు అమ్మాయిలతో చాలా సరదాగా ఉంటాడు. కానీ, అజయ్ కేంద్ర మంత్రి చౌడప్ప మనవరాలు ఝాన్సీ తో లవ్ లో పడతాడు. ఒక రోజు కేంద్ర మంత్రి “చౌడప్ప” అనుకోకుండ అజయ్ హాస్పటల్ లో చనిపోతే, అమాయకమైన జూనియర్ డాక్టర్ అజయ్ ని హత్య కేసు లో ఇరికిస్తారు. ఈ కేసు ని విచారించడానికి సెంట్రల్ నుంచి సిబిఐ అధికారి “ఉన్ని ముకుందన్” రంగంలోకి వస్తాడు. కేంద్ర మంత్రిని హత్య చేసింది ఎవరు? డాక్టర్ అమాయకుడా? చివరికి ఏం జరుగుతుంది?
కధనం,విశ్లేషణ:
పెర్‌ఫార్మెన్స్ వారీగా నటీనటులందరూ సినిమాకు తమ బెస్ట్‌ని అందించారు. ప్రతి నటుడికీ నటనకు స్కోప్ ఉంటుంది. (డాక్టర్ అజయ్) ఎంతో చక్కటి ప్రదర్శనతో సెటిల్డ్ గా పెర్ఫామెన్స్ చేసాడు. కార్తీక (మియా జార్జ్) హీరోయిన్ ఒక గ్రామంలో ఆదివాసులు నశించకుండ అక్కడి గ్రామస్థులని సంరక్షకుని గా చూసుకుంటుంది. పని మీద ఆ గ్రామానికి వచ్చిన ఉన్ని ముకుందన్ (పోలీస్ ఆఫీసర్), కళ్యాణి (కిడ్) వాళ్ళ అమ్మ వైధం కోసం లోకల్ గుండా గ్రామస్థులతో గొడవ పడతాడు. అదే విధంగా హీరోయిన్ కార్తీక తో లవ్ లో పడతాడు. ఉన్ని ముకుందన్ గ్రామంలో ఎదో కుట్ర జరుగుతుందని తెలుసుకుంటాడు. ఉన్ని ముకుందన్ పోలీసు పాత్ర చాలా నిజాయితీ ఉంటుంది.
ప్రతి ఒక్కరు కోరుకునే అన్ని అంశాలు మయూరాక్షి సినిమాలో ఉంటాయి. అయితే, ఈ చిత్రం యొక్క ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు స్లో గా సాగినప్పటికీ, సరైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దారు.
నటి నటుల పెర్ఫామెన్స్:
హీరో ఉన్నికృష్ణన్‌కి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ చిత్రంలో తన ఉత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. గోకుల్ సురేష్ ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మియా జార్జ్ (ఝాన్సీ) కథానాయికగా నటించింది, ఆమె సినిమాని తదుపరి స్థాయికి తీసుకువెళ్లింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ పరిమితం అయినప్పటికీ, తనదైన ముద్ర వేసింది. నిరంజన అనూప్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాడు. మియా, లీనా మోహన్ కుమార్, శంకర్ రామకృష్ణన్, తదితరులు కూడా తమ పాత్రల్లో డీసెంట్‌గా నటించారు.
సాంకేతిక వర్గం: డైరెక్టర్ సాయిజు ఎస్.ఎస్ కథ ని బాగానే రాణించారు. ఎడిటింగ్ విభాగంలో ఇంకా పదును పెట్టి ఉంటె బాగుండేది. కేమెరా పని తీరు పర్వాలేదు. అక్కడక్కడ వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ పర్వాలేదు అనిపించినా ఇంకా స్ట్యాన్దర్డ్స్ ఉంటె బాగుండు అనిపించింది.
రేటింగ్: 2.5/5
బాటమ్ లైన్: మాయ చేసిన “మయూరాక్షి”