Matka movie : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘మట్కా’ . ప్రస్తుతం ఈ సినిమా తన చిత్రీకరణను వేగంగా కొనసాగిస్తూ ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తోంది. పలాస ఫేమ్ కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలుగా నటిస్తున్నారు.

చిత్ర బృందం తాజాగా కాకినాడలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా.. వరుణ్ తేజ్‌ తుపాకీతో భారీ క్రూయిజ్ షిప్‌ ముందు నిలబడి ఉన్న ప్రీలుక్‌ను విడుదల చేసింది. ఈ సన్నివేశంతో పాటు చిత్రంలోని టాకీ పార్ట్‌, భారీ పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

యావత్‌ దేశాన్ని కదిలించిన కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్‌ డ్రామా మట్కా. ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ నాలుగు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నాడు. మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కు ఏ స్థాయిలో విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!