Matka movie : టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న చిత్రాలలో ‘మట్కా’ ఒకటి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగా థ్రిల్ చేయబోతున్నట్టు సమాచారం.

కరుణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మట్కా ఒక పీరియాడిక్‌ చిత్రం. కొన్ని దశాబ్దాల కిందటి వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ప్రత్యేకమైన సెట్స్‌ను నిర్మించారు. వరుణ్ తేజ్‌తో పాటు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్‌చంద్ర, సలోని, అజయ్‌ ఘోష్, కన్నడ కిశోర్‌, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నటీనటుల కలయిక చిత్రానికి మరింత ఆకర్షణను తీసుకువచ్చింది.

ఎ.కిశోర్‌కుమార్‌ ఛాయాగ్రహణం, కార్తీక శ్రీనివాస్‌.ఆర్ కూర్పు, కిరణ్‌కుమార్‌ మన్నె ప్రొడక్షన్ డిజైన్‌, జి.వి.ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. విజేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. చిత్రబృందం త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

Leave a comment

error: Content is protected !!