Shopping Cart 0 items - $0.00 0

విజయ్ vs విజయ్

 

తమిళ నాట  ఇళయదళపతి విజయ్… మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ఏ రేంజ్ స్టార్లో తెలిసిన విషయమే. వారి సినిమాలు విడివిడిగానే రిలీజ్ అయితేనే .. కోలీవుడ్ లో కోలాహలం మొదలవుతుంది. అలాంటిది వారిద్దరూ కలిసి ఒకే సినిమాలో.. అందులోనూ ఒకరు హీరోగానూ, మరొకరు విలన్ గానూ నటిస్తూంటే.. ఆ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజుండాలి? ఆ ఇద్దరినీ అలా.. ఒకే స్ర్కీన్ మీదకు తీసుకొచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. సినిమా పేరు ‘మాస్టర్’ . రీసెంట్ గా కార్తీతో ‘ఖైదీ’ తీసి… విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న యువ దర్శకుడు. తన అసాధారణ టాలెంట్ తోనే రెండో సినిమాకే విజయ్ లాంటి హీరోని తన ఇన్నోవేటివ్ స్టోరీతో పడగొట్టాడు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ‘మాస్టర్’ చిత్రానికి సంబంధించిన థర్డ్ లుక్ ను రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. విజయ్ అండ్ విజయ్ రక్తమోడుతూ.. భయంకరమైన యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్టర్ బాహుబలిని తలపిస్తోందన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో తమిళ తంబీల్ని మెప్పిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!