Shopping Cart 0 items - $0.00 0

సునీల్ ‘మర్యాదరామన్న’ చిత్రానికి 10 ఏళ్లు

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో హాస్యనటుడు సునీల్ హీరోగా నటించిన విజయవంతమైన చిత్రం ‘మర్యాదరామన్న’.  2010 లో విడుదలైన ఈ సినిమా సరిగ్గా 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. రాయలసీమ  లోని ఒక గ్రామం.  మర్యాద , మన్నన కలిగిన ఒక  ఫ్యాక్షన్ ఫ్యామిలీ. తేడాలొస్తే .. పగ తీర్చుకోడానికి , ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. విధి వశాత్తూ ఆ కుటుంబ సభ్యుల చేతికి చిక్కి.. ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని ఆ ఇంటిలో బిక్కు బిక్కుమంటూ గడుపుతాడు  రాము అనే యువకుడు.  ఎంత శత్రువైనా..  వారింట్లో ఉన్నంతవరకే అతిథి. గడపదాటితే రక్తపాతమే. మరి అలాంటి పరిస్థితుల్లో చిక్కపడిన హీరో .. పులిమీద పుట్రలా ఆ ఇంటి అమ్మాయిని ఆకర్షిస్తాడు. ఆ అమ్మాయి ప్రేమకు పాత్రుడవుతాడు. మరి ఆ ఫ్యాక్షన్ రాక్షసుల నుంచి అతడు ఎలా బతికి బట్టకడతాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.  సలోనీ కథానాయికగా నటించిన ఈ సినిమాలో .. ఇంకా నాగినీడు, ప్రబాకర్, సుప్రీత్ రెడ్డి , బ్రహ్మాజీ , యస్.యస్.కాంచి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఆద్యంతం హాస్యం, ఎమోషన్స్ మేళివించి ఈ సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దాడు రాజమౌళి. యస్.యస్.కాంచి కథ, మాటలు అందించిన ఈ సినిమాకి యం.యం.కీరవాణి అద్భుతమైన స్వరాలు కూర్చాడు. ది హాస్పిటాలిటీ అనే హాలీవుడ్ మూవీ  ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.  

 

 

Leave a comment

error: Content is protected !!