మార్టిన్‌లూథర్‌ కింగ్‌చిత్రం గురించి చెప్తూఈ కథ అందరికీ చెప్పాల్సిన కథ.. వాస్తవానికి ఇది రీమేక్‌.. ఇలాంటివి వంద రీమేక్‌లైనా చేయొచ్చు. విజయనిర్మల గారి తరహాలో విభిన్న చిత్రాలతో నా ప్రత్యేకతను చాటుకోవాలి అనుకున్నాను. పైగా ఈ కథ నాకు బాగా నచ్చింది. నేను ఎలాంటి కథ చెప్పాలి అనుకున్నానో అలాంటి కథ ఇది.

వాస్తవానికి ఇది వెంకటేష్‌ మహా ప్రాజెక్ట్‌.. అందులోకి నేను వెళ్లానన్నారు డైరెక్టర్‌. కేరాఫ్ కంచరపాలెం లాంటి గొప్ప సినిమాతో తానేంటో నిరూపించుకున్న ఆయన అంత కష్టపడుతుంటే.. నేనెంత కష్టపడాలి అని అనుకున్నాను. నేను మహా గారి దగ్గర పనిచేస్తున్న సమయంలో వైనాట్ స్టూడియోస్ వారు ఈ సినిమా కోసం ఆయనను సంప్రదించారు. మొదట రీమేక్ పై అంతగా ఆసక్తి చూపని మహా గారు.. సినిమా చూసిన తర్వాత ఇతర కమిట్ మెంట్స్ వల్ల డైరెక్ట్ చేయలేను కానీ, నిర్మాణ భాగస్వామిగా ఉంటా అన్నారు. మా టీంతో పాటు నేను కూడా ఆ సినిమా చూశాను. నా అంతట నేనుగా ఈ సినిమా చేస్తానని అడిగాను. ఈ కథలో ఎంతో లోతైన భావం ఉంది. అందుకే ఈ సినిమా చేయాలని అనిపించింది. మహా గారు వైనాట్ స్టూడియోస్ వారితో మాట్లాడి మీకు ఫిమేల్ డైరెక్టర్ ఓకేనా అని అడిగారు. సుధ కొంగర, పుష్కర్ గాయత్రి వంటి వారితో సినిమాలు చేశాము. మాకు అలాంటి భేదాలు లేవని చెప్పారు. వెంకటేష్ మహా ప్రేక్షకులనుంచి వచ్చిన డైరెక్టర్. అందుకే ఆయన స్క్రీన్‌ప్లే రాస్తేనే బాగుంటుందనిపించిందన్నారు.

సంపూర్ణేష్‌ బాబు గారు వెంకటేష్‌ మహా సెలక్షనే. ఆయన వెయ్యి శాతం న్యాయం చేసారన్నారు.

ఈ ఫీల్డ్‌లో మహిళా దర్శకులకు అవకాశాలు తక్కువే.. పట్టుదలతో ముందుకు సాగాల్సిందేనన్నారు. తమిళ్ వెర్షన్‌ లో ఎన్నో మార్పులు చేసి ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దామన్నారు. ఓటరునే కింగ్‌ గా చూపించాలనుకున్నాం. కాలేజ్ సమయంలో నేను తీసిన చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పొందాయి. అలాగే అమెజాన్ ఫారెస్ట్ లో నేను తీసిన డాక్యుమెంటరీ కూడా ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది. నేను ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకి దర్శకురాలిగా పరిచయం అవుతున్నాను కానీ, నాకు దర్శకత్వం కొత్తకాదంటున్నారు పూజ కొల్లూరు.

Leave a comment

error: Content is protected !!