గత శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర పోటిపడిన చిత్రాలు ‘మోసగాళ్ళు’, ‘చావు కబురు చల్లగా’, ‘శశి’. ఈ మూడూ చిత్రాలలో ఏ ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులను అలరించక అటు టాక్ పరంగాను కలెక్షన్స్ పరంగాను పరాజయం పొందాయి. ఈ మార్చి 26 న ‘రంగ్ దే’, ‘అరణ్య’, ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాలతో పాటు మార్చి 27న తెల్లరితే గురువారం సినిమా విడుదల కాబోతుంది.
‘రంగ్ దే’
యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు నితిన్. ఇప్పుడు రంగ్ దే సినిమాతో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంగీతం దేవి శ్రీ ప్రసాద్.
‘అరణ్య’
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన సినిమాలతో అలరించే రానా.. మరోసారి ఓ సరికొత్త పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతను సంగీతం అందించారు.
మార్చ్ 26 న రంగ్ దే, అరణ్య, హౌస్ అరెస్ట్, సైనా, సర్వం సిద్ధం, డీ కంపెనీ, వివహాబోజనంబు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో రంగ్ డే, అరణ్య సినిమాలపై అంచనలున్నాయి. అంతే కాకుండా మార్చ్ 27 న తెల్లరితే గురువారం సినిమా విడుదల కాబోతుంది. మొత్తానికి పాతిక పైగా సినిమా లతో మార్చ్ లో బాక్స్ ఆఫీసు వద్ద పండగ వాతావరణం కనిపించనుంది.
‘ఈ కథలో పాత్రలు కల్పితం’
‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమా ద్వారా పవన్ తేజ్ కొనిదెల మరో మెగా వారసుడు తెరకు పరిచయం అవుతున్నాడు. యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో, మేఘన, లక్ష్మి జై, పృథ్వీ, రఘు బాబు, అభయ్ బేతిగంటి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అభిరామ్ ఎమ్ వహించారు. నిర్మాత రాజేష్ నాయిడు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కార్తీక్ కొందకండ్ల అందించారు.
‘తెల్లారితే గురువారం’
‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు నటుడు శ్రీసింహా. అదే సినిమాతో కీరవాణి మరో తనయుడు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ‘తెల్లారితే గురువారం’ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో మణికాంత్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.