Manorathamkal webseries : మలయాళ సాహిత్య చరిత్రలో ఒక మరపురాని అధ్యాయాన్ని రాసిన ఎమ్‌.టి వాసుదేవన్ నాయర్ రాసిన అద్భుత కథల ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ‘మనోరథంగల్’. ఈ ఆంథాలజీ సిరీస్‌, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌ మలయాళ సాహిత్యం ఆధునికతకు అద్దం పడుతుంది. ఎమ్‌.టి వాసుదేవన్ నాయర్ కథలను ప్రేరణగా తీసుకుని, తొమ్మిది మంది ప్రముఖ నటులు తొమ్మిది విభిన్న కథల్లో నటించారు.

కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ వంటి దిగ్గజ నటులు తమ నటనతో ఈ సిరీస్‌కు ప్రాణం పోశారు. ప్రియదర్శన్, సంతోష్ శివన్, రంజిత్, శ్యామ్ ప్రసాద్, జయరాజ్, రతీష్ అంబట్, అశ్వతి నాయర్, మహేశ్ నారాయణన్ వంటి ప్రతిభావంతులైన దర్శకులు తమదైన శైలిలో ఈ కథలను తెరకెక్కించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్‌ విడుదల కానుండటం విశేషం. విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రోహన్దీప్ సింగ్, రాజేశ్ కేజ్రివాల్, జై పాండ్య సంయుక్తంగా ఈ సిరీస్‌ని నిర్మించారు. ఈ నెల 15న ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ కథల గ్లింప్స్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది సిరీస్‌ బృందం.

Leave a comment

error: Content is protected !!