‘మన్నవ బాలయ్య’ అంటే ఈతరం వారే కాదు కొంత మునుపటి తరం వారు కూడా గుర్తుపట్టకపోవచ్చు. పోనీ ‘బాలయ్య’ అని అందామంటే హీరో ‘నందమూరి బాలకృష్ణ’ నా అనే అపోహ కూడా లేకపోలేదు. మరి ఆయన్ను ఎలా గుర్తు చేయాలని ఆలోచిస్తే… ‘భక్త కన్నప్ప’ లో తెలుగువారందరికి ‘శివుడు’ అంటే ఇలానే ఉంటాడేమో అనేంతలా ఆకట్టుకున్న ఆ ‘వెండితెర శివయ్యే’ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలయ్య. ‘మన్నవ’ అనేది ఆయన ఇంటిపేరు. చూడగానే ఆకట్టుకునే మంచి పర్సనాలిటి, నటనా ప్రతిభ కలిగి ఉన్న నటులు. అందుచే కేవలం సాంఘిక చిత్రాల్లోనే కాక పౌరాణిక చిత్రాల్లో కూడా రాణించారు. సినిమాలలోకి రాకముందు రంగస్థల నటుడుగా వ్యవహరించారు. ఆయన 91వ పుట్టినరోజు నేడు.

బాలయ్య… గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930 సం”లో గుంటూరు జిల్లా వైకుంఠపురం (అమరావతి) శివారు గ్రామమైన చావపాడు లో జన్మించారు. బాలయ్య 1952లో మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ పూర్తి చేశారు. బాలయ్య సినీరంగ ప్రవేశం చేయక ముందు రంగస్థల నటుడుగా వ్యవహరిస్తూనే 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌ కాలేజిలో లెక్చరర్‌గా పనిచేశారు.

సినిమా ప్రస్థానం :

‘ఎత్తుకు పై ఎత్తు’ చిత్రంతో బాలయ్య హీరోగా పరిచయమై విలన్‌ గా, క్యారక్టర్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ‘అమృతా ఫిలింస్‌’ సంస్థని నెలకొల్పి అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావులను నిర్మాతలుగా చేసి చక్కని అభిరుచి గల చిత్రాలను అందించారు. మంచి పర్సనాలిటి, నటనా ప్రతిభ కలిగి ఉండటం వలన సాంఘిక చిత్రాల్లోనే కాక పౌరాణిక చిత్రాల్లో కూడా రాణించారు. సినిమాలలోకి రాకముందు రంగస్థల నటుడుగా వ్యవహరించారు. తను నిర్మించే చిత్రాలకు కథను కూడా తనే సమకూర్చేవారు బాలయ్య.

అటు నిర్మాణం ఇటు దర్శకత్వం :

బాలయ్య నిర్మాతగా 1981లో విశ్వనాథ్‌ దర్శకత్వంలో శోభన్ బాబు డిగ్లామర్ గా నటించిన ‘చెల్లెలి కాపురం’ చిత్రాన్ని, కృష్ణ హీరోగా ‘నేరము –  శిక్ష’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తమిళ హిందీ భాషల్లోనూ నిర్మించారు.

‘చుట్టాలున్నారు జాగ్రత్త’, ‘కిరాయి అల్లుడు’, ‘అన్నదమ్ముల కథ’, ‘ప్రేమ –  పగ’, ‘పసుపుతాడు’, ‘ఈనాటి బంధం ఏనాటిదో’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ‘ఊరికిచ్చిన మాట’ చిత్రంతో దర్శకుడుగా మారి అభిరుచితో మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.

‘కుంకుమరేఖ’, ‘చివరకు మిగిలేది’, ‘మోహినీ రుక్మాంగద’, ‘మొనగాళ్ళకు మొనగాడు’, ‘పార్వతీ కళ్యాణం’ తదితర చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాలకు కూడా సరిపోయే పెర్సనాల్టి బాలయ్యకు అదనపు అర్హత అయింది. ‘మొనగాళ్ళకు మొనగాడు’ చిత్రంలో తెరపై సిగరెట్‌ పొగ ముందు రాగా తర్వాత బాలయ్య ఇచ్చిన ఎంట్రన్స్‌ తో అతడే ‘సి.ఐ.డి. ఆఫీసర్‌’ అనే భ్రమ కల్పించిన అసలు సిసలైన విలన్‌ గా మంచి పేరు తెచ్చుకున్నారు బాలయ్య.

‘చెల్లెలి కాపురం’, ‘ఊరికిచ్చిన మాట’ చిత్రాలకు నంది అవార్డులు లభించాయి.

ఎప్పటికి గుర్తుండే చిత్రాలు :

‘భక్త కన్నప్ప’, ‘పాండురంగడు’, ‘తప్పుచేసి పప్పుకూడు’, ‘పెళ్లిసందడి’, ‘అన్నమయ్య’, ‘మల్లీశ్వరి’, ‘మన్మధుడు’ తదితర చిత్రాల్లో నటించారు బాలయ్య.

మంచి పర్సనాలిటిని కలిగి తన నటనా ప్రతిభతో కేవలం సాంఘిక చిత్రాల్లోనే కాక పౌరాణిక చిత్రాల్లో కూడా రాణించి అటు నిర్మాతగా ఇటు దర్శకుడిగా అభిరుచి ఉన్న చిత్రాలను అందించి ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!