Manjummel Boys : మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మలయాళ చిత్ర దర్శకుడు చిదంబరం ఇప్పుడు హిందీ సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ‘ఫాంటమ్ స్టూడియోస్’ తో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్‌పై పని చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా చిదంబరానికి కొత్త జానర్ అయినప్పటికీ ఫాంటమ్ స్టూడియోస్‌కు కూడా ఇది ఒక కొత్త ప్రయత్నం కానుంది.

ఫాంటమ్ స్టూడియోస్ CEO సృష్టి బెహ్ల్ మాట్లాడుతూ, “చిదంబరాన్ని ఫాంటమ్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంస్థ ఎల్లప్పుడూ అత్యుత్తమ సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. భాషా అడ్డంకులను దాటి, కొత్త ప్రతిభలను హిందీ సినీ పరిశ్రమకు తీసుకురావాలని మేము భావిస్తున్నాము. చిదంబరం ఈ విషయంలో మాకు చాలా కోపరేట్ చేస్తాడని నమ్ముతున్నాము.

దర్శకుడు చిదంబరం ప్రత్యేకమైన దృక్పథం, కథాకథన శైలి ఫాంటమ్ స్టూడియోస్ ఆలోచనలకు చాలా బాగా సరిపోతాయి. అతని దృష్టిని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నందుకు  మేం సంతోషిస్తున్నాం. అన్నారు. మంజుమ్మెల్ బాయ్స్ సినిమా రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి, రూ. 242.3 కోట్లు వసూలు చేసి అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. 2018 తర్వాత మలయాళంలో ఇంతటి విజయాన్ని సాధించిన మరో సినిమా లేదు.

హిందీ సినీరంగంలో తన అరంగేట్రం గురించి మాట్లాడుతూ చిదంబరం ఇలా అన్నారు, “హిందీ సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ఒక అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉంది. మంజుమ్మల్ బాయ్స్ ఎల్లప్పుడూ నాకు ప్రత్యేకమైన సినిమా. నా మొదటి హిందీ సినిమా కోసం ఫాంటమ్ స్టూడియోస్‌తో కలిసి పని చేయడం నాకు గౌరవంగా ఉంది. ఇది కొత్త కథలను అన్వేషించడానికి మరియు విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి ఒక అవకాశం. అదే సమయంలో నా పనికి నమ్మకంగా ఉండగలనని నమ్ముతున్నాను. అన్నారు.

Leave a comment

error: Content is protected !!