పాయల్‌ రాజ్‌ పుత్, అజయ్‌ భూపతి కాంబోలో రాబోతున్న మూవీ మంగళవారం‘. టైటిల్‌తోనే ఇంట్రస్ట్‌ క్రియేట్ చేసిన ఈమూవీని స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ లు సంయుక్తంగా ముద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా ఆయిదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్‌ స్వాతిరెడ్డి, సురేష్ వర్మలు మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ చిత్రం లేట్ అయ్యిందనుకోవడం లేదని, ఆర్‌ఎక్స్‌ 100 టైమ్‌ లోనే ఈ కథ అజయ్‌ చెప్పడంతో ఎగ్జైట్‌ అయ్యి చేయాలనుకున్నామని తెలిపారు సురేష్ వర్మ. అయితే ఆ కథను అజయ్‌ భూపతి సొంతంగా ప్రొడ్యూస్‌ చేయాలనుకున్నారు. వేరే ప్రొడ్యూసర్స్‌ తో మాట్లాడినపుడు ఈ కథ గురించి చెప్పేవాడిని. అలా స్వాతితో కూడా చెప్పాను. కథ విందాం రమ్మని చెప్పండన్నారు. అలా కథ విన్నాక చాలా ఎగ్జయిట్ అయ్యి ఇద్దరం కలిసి సినిమా ప్రొడక్షన్‌లో భాగమయ్యామన్నారు.

వాస్తవానికి స్వాతి, సురేష్‌ వర్మలు మాటీవిలో పనిచేస్తున్నప్పటినుంచి పరిచయం ఉంది. ఇద్దరికీ సినిమా నిర్మాణం కామన్‌ ఇంట్రస్ట్‌. అప్పుడే అనుకున్నాం సినిమా చేస్తే ఇద్దరం కలిసే తీయాలనుకున్నాం. అలా ముద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ స్టార్ట్ చేసామన్నారు.

బన్నీతో ఎప్పటి నుంచో స్నేహం ఉంది. బెంగళూరు కాలేజ్‌ లో చదువుతున్నపుడు ఓ ఫంక్షన్‌ కు ఛీఫ్‌ గెస్ట్‌గా అల్లు అర్జున్‌ ని పిలిపించమని మా ప్రిన్సిపల్‌కి కండిషన్‌ పెట్టానన్నారు స్వాతి. అప్పటి నుంచి బన్నీతో మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అల్లు స్నేహ మావారు ప్రణవ్ క్లాస్‌మేట్.. అలా మా ఫ్యామిలీల మధ్య మంచి బాండింగ్‌ ఉందన్నారు స్వాతి. ఈ సినిమా చేస్తున్నపుడు బన్నీకి చెప్తే కలను కలగా వదిలేయొద్దు ఏదైతే అదయింది ముందు సినిమా స్టార్ట్‌ చేయి.. కాకపోతే భాగస్వామ్యంలో చేయమన్నారు. ఎప్పటినుంచో సురేష్ గారితో సినిమా చేద్దామనుకున్నాను కాబట్టి ఫస్ట్‌ సురేష్ వర్మకే కాల్ చేసానన్నారు. అలా ఇద్దరి కాంబినేషన్‌లో మంగళవారం స్టార్ట్‌ చేసామన్నారు.

డైరెక్టర్‌ అజయ్‌ భూపతి కథ నేరేట్‌ చేసేటపుడే మంగళవారం అని టైటిల్‌ చెప్పారు. కథ ఎగ్జయిటింగ్‌ గా ఉండటంతో వెంటనే ఒప్పుకున్నామన్నారు. చాలామంది మంగళవారం టైటిల్‌ అంటే నెగటివ్‌గా ఫీలవుతారు. కానీ ఈ కథకు మంగళవారం చాలా యాప్ట్ టైటిల్‌. కాంతారా కంటే ముందే ఈ కథ అజయ్‌ చెప్పారు. ఇలాంటి జోనర్‌ మూవీస్‌ ఇప్పుడు మంచి హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేసారు ప్రొడ్యూసర్స్‌.

పెద్దహీరోలతో సినిమా చేయడానికి స్ట్రెస్‌ ఎక్కువ ఉంటుంది. కాస్త అనుభవం వచ్చాక ట్రై చేస్తామని చెప్పారు స్వాతిరెడ్డి, సురేష్ వర్మ.

Leave a comment

error: Content is protected !!