మంగళవారం – ఈ పేరులో మంగళం ఉన్నా చాలా మంది శుభకార్యాలు, ముఖ్యమైన పనులు చేయడానికి ఈ వారం అమంగళంగా భావిస్తుంటారు. మంగళవారం కు సంబంధించి వ్యంగ్య సామెతలు కూడా దర్శనమిస్తుంటాయి. సెంటిమెంట్స్‌ కి కేరాఫ్ అడ్రస్‌ అయిన సినీ పరిశ్రమలో కూడా మంగళవారం నాడు సినిమాకు సంబంధించిన ఏ ముఖ్య కార్యక్రమాలు చేయరు. అలాంటిది ఓ సినిమాకు మంగళవారం అని పేరు పెడతారా..? కానీ ఆర్‌ ఎక్స్‌ 100తో టాలెంట్‌ ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్‌ అజయ్‌ భూపతి తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు. తన సినిమాకు మంగళవారం అని పేరు పెట్టాడు. టైటిల్ వెల్లడించడంతో పాటు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.
ఎందుకీ సినిమాకు మంగళవారం అని పేరు పెట్టారు ? మంగళవారం అని ఎందుకు పేరు పెట్టారో సినిమా చూస్తే తెలుస్తుంది.. ఆడియెన్స్‌ థ్రిల్‌ అవుతారు అంటున్నాడు అజయ్‌ భూపతి. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో 30 క్యారెక్టర్స్ ఉంటాయనీ, ఏ క్యారెక్టర్‌కు ఆ క్యారెక్టర్‌ ప్రత్యేకతను కలిగి ఉంటాయట. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ టచ్‌ చేయని కొత్త జానర్‌లో ఈ మంగళవారం సినిమా రాబోతుందంటున్నాడు డైరెక్టర్ అజయ్‌ భూపతి. ‘ A ‘ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ స్థాపించి ఈ సినిమాతో డైరెక్టర్‌ అజయ్‌భూపతి ప్రొడ్యూసర్‌గా కూడా మారారు. ‘ A ‘ క్రియేటివ్‌ వర్క్స్‌ తో పాటు ముద్రా మీడియా వర్క్స్‌ బ్యానర్‌ పై స్వాతి గునుపాటి, సురేష్‌ వర్మ. ఏం లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాంతారా ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సౌత్ ఇండియా భాషల్లో రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమాలో నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తామని వెల్లడించారు ప్రొడ్యూసర్స్‌.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి, ఆర్ట్ : రఘు కులకర్ణి, సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ రాజా కృష్ణన్, సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర, మ్యూజిక్ : ‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : అజయ్ భూపతి.

Leave a comment

error: Content is protected !!