Kannappa : విష్ణు మంచు ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “కన్నప్ప” చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక ఫాంటసీ డ్రామా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు లేటెస్ట్ గా .. కన్నప్ప టీమ్, విష్ణు మంచు తనయుడు అవ్రామ్ మంచును కీలక పాత్రలో అధికారికంగా పరిచయం చేసింది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది.

ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మాధుబాలలతో సహా ప్రముఖ నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రానికి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఎవా ఎంటర్‌టైన్‌మెంట్ భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నాయి. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మధవ్, తోట ప్రసాద్‌లు రచించిన స్క్రీన్‌ప్లే మరింత ఉత్కంఠను రేకెత్తిస్తుంది. స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతం దర్శకత్వం ప్రాజెక్ట్‌పై అంచనాల్ని మరింత పెంచుతుంది. మరి కన్నప్పలో అవ్రామ్ కు ఏ పాత్ర ఇచ్చారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!