పవర్ లో కరెంట్ తీగ.. పౌరుషంలో గుంటూరోడు, యాక్షన్ లో శౌర్య.. బిందాస్ గా యాక్టింగ్ టాలెంట్ చూపిస్తాడు. నేను మీకు తెలుసా?, ఊకొడతారా ఉలిక్కిపడతారా? అంటూ థ్రిల్ చేస్తాడు. ఎప్పటికప్పుడు యాక్షన్ తో అటాక్ చేసి.. పోటుగాడు అనిపించుకుంటాడు. అతడి పేరు మనోజ్ కుమార్. నటనలోనూ, మంచి మనసులోనూ..   తండ్రి మోహన్ బాబు నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తనదైన శైలిలో నటించి మెప్పించే అతడు..  జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు.

మంచు మనోజ్‌ 20 మే 1983లో జన్మించాడు. సౌత్‌ ఈస్టర్న్‌ ఓక్లహామా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ అందుకొన్న మనోజ్‌… చిన్నప్పుడే ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంలో నటించారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆ చిత్రంలో నటించడం మరిచిపోలేని అనుభూతి అంటుంటారు మనోజ్‌. ఆ తర్వాత పుణ్యభూమి నాదేశం, ‘అడవిలో అన్న’, ‘ఖైదీగారు’ చిత్రాల్లోనూ బాలనటుడిగా మెరిశాడు. 2004లో ‘దొంగ దొంగది’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘శ్రీ’, ‘రాజుభాయ్‌’, ‘నేను మీకు తెలుసా?’, ‘ప్రయాణం’, ‘బిందాస్‌’, ‘వేదం’, ‘ఝుమ్మంది నాదం’, ‘మిస్టర్‌ నూకయ్య’, ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’, ‘పోటుగాడు’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘కరెంట్‌ తీగ’, ‘దొంగాట’, ‘శౌర్య’, ‘అటాక్‌’, ‘గుంటూరోడు’   ‘ఒక్కడు మిగిలాడు’లో నటించారు. ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రం చేస్తున్నాడు. నేడు  మంచు మనోజ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే మంచు మనోజ్

Leave a comment

error: Content is protected !!