Manchu Manoj : మంచు మనోజ్ కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసారి మాత్రం విలన్ గా నటించి, కొత్తగా సత్తా చాటాలని భావిస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న “మిరాయ్” అనే భారీ బడ్జెట్ సినిమాలో మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ఒక గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో మనోజ్ లుక్ చాలా పవర్ ఫుల్ గా, భయంకరంగా ఉంది.

నల్లని దుస్తులు, పొడవాటి జుట్టు, చేతిలో భారీ కత్తితో మనోజ్ కొత్తగా కనిపించాడు. ఈ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. “బ్లాక్ స్వార్డ్” అనే పాత్రలో మనోజ్ నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలవబోతున్నాయి అని తెలుస్తుంది. ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఒకటి విడుదలై, మంచి స్పందనను అందుకుంది. “మిరాయ్” సినిమా 2025 ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మంచు మనోజ్ ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడా అనేది చూడాలి.

Leave a comment

error: Content is protected !!