Kannappa movie : టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ నుంచి తదుపరి తరం తెరపైకి అడుగు పెడుతోంది. హీరో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్, తన తాత మోహన్ బాబు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

కృష్ణాష్టమి సందర్భంగా విడుదలైన అవ్రామ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప చిన్నప్పటి పాత్రలో అవ్రామ్ కనిపించడం విశేషం. ఈ పాన్ ఇండియా సినిమాను ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. మంచు విష్ణు కొత్త ఇమేజ్‌లో కనిపించడంతో పాటు, స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ ఈ సినిమాను తెలుగు సినీ ప్రేక్షకులకు మరపురాని అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. అవ్రామ్ లుక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్న మోహన్ బాబు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. మంచు వంశం తదుపరి తరం సినిమా రంగంలోకి అడుగు పెట్టడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Leave a comment

error: Content is protected !!