సీనియర్ నరేష్ నటజీవితంలో మరపురాని కుటుంబ కథా చిత్రం ‘మనసు మమత. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో మౌళీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాత రామోజీరావు. డివి నరసరాజు , మౌళీ సంయుక్తంగా కూర్చిన కుటుంబ కథ .. చిత్రానికి ఘనవిజయం చేకూర్చింది. 1990, జూన్ 29న విడుదలైన ఈ సినిమా నేటికి సరిగ్గా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సితార కథానాయికగా నటించిన ఈ సినిమాలో రావుగోపాలరావు, మాస్టర్ తరుణ్, రాళ్ళపల్లి, సుధాకర్, శశిధర్, కాదంబరి కిరణ్, తిలక్, జెన్నీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కాగా.. మాటల రచయిత డివి నరసరాజు చిన్న పాత్రలో కనిపిస్తారు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న లక్ష్మి .. ఒక యాక్సెడెంట్ లో భర్తను పోగొట్టుకుంటుంది. ఆ తర్వాత మరొకరిని పెళ్ళి చేసుకుంటుంది. అయితే ఆమె మొదటి భర్త వల్ల గర్భవతి అవుతుంది. బాబు పుడతాడు. ఆ తర్వాత  మళ్ళీ పాప పుడుతుంది. ఆ పిల్లలిద్దరి మధ్య అనుబంధం , ఆ బాబుకి తన తాతతో గల బాండింగ్ ఈ సినిమాకు హైలైట్ పాయింట్స్ . ఇక ఈ సినిమా మెలోడీ కింగ్ కీరవాణికి మొదటి చిత్రం అవడం విశేషం. మొదటి సినిమాతోనే అద్భుతమైన పాటల్ని అందించి.. చిత్ర విజయానికి ఎంతో దోహదపడ్డారు.  విడుదలై.. 30 ఏళ్ళు అయినా.. ‘మనసు మమత’ చిత్రాన్ని ఇప్పటికీ ఇష్టపడేవారు  చాలా మంది ఉన్నారు.

Leave a comment

error: Content is protected !!