Maname trailer :  శర్వానంద్ నటించిన ‘మనమే’ చిత్రం జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, శర్వానంద్ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడు అనిపిస్తోంది.

ఈ సినిమా కామెడీ అండ్ ఎమోషన్స్ తో తెరకెక్కింది. శర్వానంద్, కృతి శెట్టి కు ఒక బిడ్డ ఉన్నట్టు రివీలైంది. పిల్లల్ని పెంచడం అంటే.. హీరోని చాలా ఇబ్బంది పెట్టే వ్యవహారం. అయితే కృతి శెట్టి పిల్లలను ఎలా పెంచాలో శర్వానంద్‌కు చెబుతూనే ఉంటుంది. హీరో చిరాకు పడతాడు. ట్రైలర్ ముందుకు సాగుతున్న కొద్దీ, నవ్వు నుండి భావోద్వేగ కోణానికి మారుతుంది. శర్వానంద్, కృతి శెట్టి భార్యాభర్తలు కారా? వారు ఆ పిల్లల తల్లిదండ్రులు కారా? అవును అయితే, శర్వానంద్ ఎందుకు చిరాకు పడుతున్నాడు? జవాబుల కోసం జూన్ 7వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
ట్రైలర్‌ను ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కట్ చేశారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం కూడా అద్భుతంగా ఉంది.

 

Leave a comment

error: Content is protected !!