సోషల్ మీడియాలో అందాలకు కొదవేం ఉంది? ఇన్ స్టా తెరిస్తే చాలు.. హాట్ భామల అందాలన్నీ తెరిచిన పుస్తకంలా కనిపిస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి. దక్షిణాది అందాల భామ మళవికా మోహనన్ ప్రస్తుతం అలాంటి అందాల షోతో ఆకర్షిస్తోంది. మలయాళ , కన్నడ , తమిళ చిత్రాల్లో ఇటు అందంతోనూ , అటు అభినయంతోనూ మెప్పించిన ఈ భామ.. ఇటీవల అమెజాన్ ఫిల్మ్ ఫెస్ట్ కోసం హాటాతి హాట్ గా ముస్తాబై.. ఓ ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలన్నిటినీ ఇటీవల అమ్మడు తన ఇన్ స్టా ఖాతాలో తగిలించింది. అంతే.. ఆమె గ్లామరస్ ఫోటోస్ కు లైకులే లైకులు.

దాదాపు లక్షా ఎనభై వేల లైక్స్ తో నెటిజెన్స్ అమ్మడి అందాలకు ఫిదా అవుతూ.. తమ రెస్పాన్స్ ను తెలిపారు.  కేవలం రెండు రోజుల్లోనే అమ్మడు తన గ్లామర్ సత్తా ఏంటో ఇన్ స్టాలో చాటిచెప్పింది. ఆ మధ్య రజినీకాంత్ పేటలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ చిత్రంలో నటిస్తోంది.  సో.. తన  అందాలకు దాసోహమైన ఏ తెలుగు దర్శకుడైనా ఉండకపోతాడా? తెలుగులో అరంగేట్రం చేయించకపోతాడా అని ఆమె ఇలా గ్లామర్ గాలం వేసినట్టు అనిపిస్తోంది కదూ.. ఏమో .. తెలుగు ప్రేక్షకులకు  కూడా అమ్మడు తన గ్లామర్ టేస్ట్ రుచి చూపిస్తుందేమో చూద్దాం.

Leave a comment

error: Content is protected !!