యన్.జీ.కే , ‘బందోబస్త్’ సినిమాల  తర్వాత తమిళ హీరో సూర్య నటిస్తోన్న తాజా చిత్రం సూరారై పోట్రు. తెలుగులో ఆకాశమే నీ హద్దురా టైటిల్ తో రానున్న ఈ సినిమాను  ‘గురు’ ఫేమ్ సుధ కొంగర డైరెక్ట్ చేస్తోంది.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఆ మధ్యనే  రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్‌లో స్లీవ్ లెస్ టీ షర్టు వేసుకొని.. గాల్లో ఎగురుతూ ఉన్న సూర్య పోస్టర్ , గాల్లో గాగుల్స్ తో సూర్య లుక్స్ ట్రెండీగా మారాయి. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇందులో  టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.  మలయాళ భామ అపర్ణా బాలమురళి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో జాకీష్రాఫ్, పరేష్ రావల్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ  సినిమాను 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్నాడు. వచ్చే యేడాది సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.  తాజా గా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో  మేకింగ్ ఆఫ్ మారా .. స్ర్కిప్ట్ టు స్ర్కీన్  పార్ట్ 1  విడుదల చేశారు. ఇందులో సూర్య వర్కవుట్ చేసే ఫుటేజ్ చూపరులకు షాకింగ్ గా మారింది. ఒక ట్రైనర్ సహాయంతో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న సూర్య .. ఈ సినిమాలోని పాత్రను బట్టి.. తన బాడీని చాలా ఫిట్ గా ఉంచుకొనే క్రమంలో చాలా కష్టపడ్డాడు.

మేకింగ్ వీడియో వీక్షించడానికి ఈ కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=CNWaN6_Aul0&feature=youtu.be

 

Leave a comment

error: Content is protected !!