Loveme movie : ఆశిష్ , వైష్ణవి చైతన్య జోడీగా నటించిన వెరైటీ లవ్ స్టోరీ లవ్ మీ. ఈ శనివారం విడుదలకు సిద్ధంగా ఉంది. “ఇఫ్ యూ డేర్” అనేది ట్యాగ్ లైన్. కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ హారర్ థ్రిల్లర్. లవ్ మీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ సమయంలో ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు మేకర్స్.

దర్శకుడు అరుణ్ .. ‘లవ్ మీ’ సినిమాకి సీక్వెల్ ఉంటుందని డిక్లేర్ చేశాడు. దానికి ‘కిల్ మీ ఇఫ్ యూ లవ్’ అనేది ట్యాగ్ లైన్ . షూటింగ్ చాలా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. సీక్వెల్‌లో కూడా ఆశిష్ నే హీరోగా నటిస్తున్నాడు. లవ్ మీ సినిమాపై చిత్ర బృందం చాలా కాన్ఫిడెన్స్ తో ఉంది. అందుకే రెండవ భాగాన్ని ప్రకటించారు.

హర్షిత్ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి సంయుక్తంగా ‘లవ్ మీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి నిర్మాతలు భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ఆస్కార్ గెలుచుకున్న సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. లెజెండరీ పి.సి. శ్రీరామ్ కెమెరా వర్క్ చేశారు. సినిమా ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.

 

Leave a comment

error: Content is protected !!