Maheshbabu : హాలీవుడ్‌ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాల్లో మన స్టార్ హీరోల కంఠం వినిపిస్తే ఆ అనుభూతి మరో లెవెల్‌కి చేరుకుంటుంది. ఇప్పుడు అలాంటి అద్భుతమే జరగబోతోంది. ప్రపంచ ప్రసిద్ధ ‘ది లయన్‌ కింగ్‌’ ఫ్రాంచైజీలో రెండో భాగంగా వస్తున్న ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ సినిమాలో ముఖ్య పాత్ర అయిన ముఫాసాకి తెలుగు సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు డబ్బింగ్ చెప్పబోతున్నారు.

ఈ విషయాన్ని ప్రముఖ హాలీవుడ్‌ సంస్థ వాల్ట్‌ డిస్నీ స్టూడియోస్‌ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా, ఈ నెల 26న సినిమా ట్రైలర్‌ను తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సినిమాను బేరీ జెంకిన్స్‌ తెరకెక్కిస్తున్నారు. అలాగే.. కామెడీ కింగ్స్ బ్రహ్మానందం,  అలీ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలకు డబ్బింగ్ చెప్పి ఆకట్టుకోబోతున్నారు. బ్రహ్మానందం పుంబా పాత్రకు, అలీ టిమోన్‌ పాత్రకు తమ గళాన్ని అందించనున్నారు. మొత్తానికి, ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరపురాని అనుభవాన్ని ఇవ్వబోతోంది. మహేశ్‌ బాబు, బ్రహ్మానందం, అలీ వంటి మన స్టార్ల కంఠాలతో సాగే ఈ సినిమా కోసం అందరం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.

Leave a comment

error: Content is protected !!