సూపర్ స్టార్ మహేశ్ బాబు 40 ప్లస్ ఏజ్ లో ఉన్నా కూడా ఇంకా కాలేజీ కుర్రాడిలా కనిపించడం అతడి  ప్రత్యేకత. తండ్రి కృష్ణ నట వారసత్వంతో పాటు ఆయన గ్లామర్ ను కూడా పుణికిపుచ్చుకున్న మహేశ్ .. తదుపరి చిత్రం లో మరోసారి కాలేజీ కుర్రాడిలా కనిపించనున్నాడని సమాచారం. పరుశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్‌బాబు కాలేజీ విద్యార్థిగా నటించనున్నారని చెప్పుకుంటున్నారు.

పరుశురామ్‌ కూడా సినిమా కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారట. ఇప్పటికే ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ చిత్రాల్లో మహేష్‌బాబు కాలేజీ విద్యార్థిగా నటించిన సంగతి తెలిసిందే. ఇక దర్శకుడు పరశురామ్‌ ప్రేమకథలను బాగా తెరకెక్కించగలనే పేరు కూడా ఉంది. లాక్‌డౌన్‌ పూర్తికాగానే సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి కాలేజీ స్టూడెంట్ గా మహేశ్ బాబు ఎంత గ్లామర్ గా కనిపిస్తాడో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!