ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులనుంచి సెలబ్రిటీస్ వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్ డౌన్ సమయాన్ని పలువురు వివిధరకాలుగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ .. ఈ విషయంలో చాలా ముందున్నారు. కొందరు ఇంటిపనులు, వంట పనులు చేస్తుంటే.. మరికొందరు కథలు, కవిత్వం, చిత్రలేఖనం లాంటి వాటిలో తమ ప్రతిభ చూపిస్తున్నారు. ఇంకొందరు తమకిష్టమైన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్స్ మాత్రం తమ క్వాలిటీ టైమ్ ను తమ కుటుంబ సభ్యులతో స్పెండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్స్ నిలిచిపోవడంతో మహేష్ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతున్నాడు. ఇటీవలే సితార తండ్రికి హెడ్ మసాజ్ చేస్తున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇక తాజాగా మహేష్ బేబీ సితారతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్నాడు. తను ఈత కొట్టడమే కాకుండా కూతురుకి కూడా ఈత నేర్పిస్తున్న సీన్ చూడొచ్చు. ఇంకా అసలు విషయం ఏంటంటే.. ఫస్ట్ టైమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చొక్కా లేకుండా.. కనిపించి ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇంతవరకు మహేష్ బాబు ఎప్పుడు కూడా తన ఫిట్ జిమ్ బాడీని ఎక్కడ కూడా ప్రదర్శించలేదు. తొలిసారిగా ఇలా సూపర్ స్టార్ బేర్ బాడీతో కనిపించి ఫ్యాన్స్ ను సడెన్ సర్ ప్రైజ్ చేశారు. మహేశ్ భార్య నమ్రత ఇన్ స్టా లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"Getting ready for a lap !! " – Namrata Via Instagram @urstrulymahesh #Maheshbabu #Sitara pic.twitter.com/3f1jPQbQFr
— BARaju (@baraju_SuperHit) May 18, 2020