‘Mahesh babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్స్ ఎంత మందున్నా.. క్రేజీ కాంబినేషన్స్‌ ఎన్నున్నా.. మహేష్‌ , త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కున్న క్రేజే వేరు. అతడు బ్లాక్‌ బస్టర్ అయినా, ఖలేజా కమర్షియల్ ఫ్లాప్ అయినా..ఈ కాంబినేషన్‌ చేసే మేజిక్‌ కోసం ఆడియెన్స్‌ ఎన్నో ఏళ్లుగా వెయిట్‌ చేస్తున్నారు. ఆ మేజిక్‌ గుంటూరు కారంతో మళ్లీ మరింత డోస్‌ తో జరగబోతుంది అని సాక్షాత్తూ మహేష్‌ బాబే చెప్పాడు. గుంటూరు కారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో మహేష్‌ బాబు ఎప్పుడూ లేనంతగా.. ఎన్నడూ చూడనంతగా.. కొత్తగా సరికొత్త ఎగ్జయిట్‌మెంట్‌తో కనిపించాడు.
త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో మహేష్‌ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి మెయిన్‌లీడ్‌తో హారికా హాసిని క్రియేషన్స్‌ నిర్మించిన గుంటూరు కారం చిత్రం జనవరి 12 రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా గుంటూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సారి పండక్కి రమణగాడితో అద్భుతంగా చేసుకుందాం అంటూ త్రివిక్రమ్‌ ఫ్యాన్స్‌ను హుషారెత్తిస్తే… ప్రతీ సంక్రాంతికంటే ఈసారి ఇంకాస్త గట్టిగా కొట్టబోతున్నాం అంటూ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించాడు.

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గుంటూరులో గ్రాండ్ గా జరిగింది. వేలాది అభిమానుల సమక్షంలో చిత్ర టీమ్‌ చేసిన ఈ ఈవెంట్ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. చిత్ర యూనిట్ , నటీనటులు సినిమా విజయం పట్ల , షూటింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ షేర్ చేసుకుని సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్ కావడం ఖాయం అంటూ నమ్మకం వ్యక్తం చేసారు.
త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా కోసం ఇండస్ట్రీలో వందకి 200 శాతం కష్టపడే ఏకైక హీరో మహేష్‌ బాబు.. సూపర్‌స్టార్‌ కృష్ణ వారసుడిగా.. ఆయన మంచితనం డెడికేషన్‌ నూటికి నూరు శాతం పుణికి పుచ్చుకున్న మహేష్ బాబుకు మరిన్ని వసంతాలు ఉండాలని, మీరంతా మహేష్ బాబుకు సపోర్ట్‌గా ఉండాలనీ, ఈ పండగని గుంటూరు కారం రమణ గాడితో బాగా జరుపుకుందామన్నారు
ఈ ఫంక్షన్‌లో ఎప్పుడూ లేనంత ఎగ్జయిట్‌మెంట్‌తో కనిపించారు మహేష్‌ బాబు. గుంటూరు కారం క్రెడిట్‌ పూర్తిగా త్రివిక్రమ్‌కే ఇచ్చేసారు మహేష్‌బాబు. ఫంక్షన్‌ వేదిక గుంటూరులో జరగడం కూడా త్రివిక్రమ్‌ ఐడియానేనని మన ఫ్యాన్స్ అంతా ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నారు. త్రివిక్రమ్‌తో ఎప్పుడు సినిమా చేసిన తనకు తెలియకుండానే ఏదో మ్యాజిక్ జరుగుతుందని.. ఈ సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్కే జరుగుతుందని, కొత్త మహేష్‌ ని చూడబోతున్నారు అని ఫ్యాన్స్‌ ఉర్రూతలూగించారు. త్రివిక్రమ్‌ తనకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అనీ, ఫ్యామిలీ మెంబర్‌ లాంటోడనీ. ఈ రెండు సంవత్సరాలు ఆయనిచ్చిన సపోర్ట్‌ మరువలేనని త్రివిక్రమ్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు. తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ ని గుర్తు చేసుకుంటూ.. ప్రతీ సంక్రాంతి మాకు బాగా కలిసొస్తుందని.. ఈసారి కొత్తగా ఉందన్నారు. బహుషా నాన్నగారు లేకపోవడం వల్లేనేమో.. ఆయన ప్రతీ సినిమాకి కలెక్షన్స్ రిపోర్ట్ చెప్తుండేవారు.. ఈసారి ఆయన లేరు.. నాకు అమ్మా నాన్న అన్నీ మీరే.. ఇక మీరే నాకు చెప్పాలి అంటూ ఫ్యాన్స్‌తో మనసు విప్పి మాట్లాడారు.
ఫంక్షన్‌ ఆద్యంతం ఫ్యాన్స్‌ విజిల్స్‌ తో ఉర్రూతలూగేలా జరిగింది. సినిమా బ్లాక్‌బస్టర్‌ వైబ్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కనిపించింది.

Leave a comment

error: Content is protected !!