సూపర్‌స్టార్ మహేష్ బాబు తీసుకున్న డెసిషన్ ఒక ముగ్గురికి బాగా కలిసొచ్చింది. ఒక తమిళ్ స్టార్ డైరెక్టర్ చెప్పిన లవ్‌స్టోరీని వద్దన్నాడు. ఈ కథను తీసుకొచ్చింది మరెవ్వరో కాదు మహేష్ అక్క మంజులనే. ఇంత బ్యూటిఫుల్ లవ్‌స్టోరీని మహేష్ చేయనని చెప్పడానికి కారణం ఆ స్టోరీ నచ్చక కాదు. విషయంలోకి వెళ్తే మహేష్‌కు అప్పటికే స్టార్ ఇమేజ్ వచ్చిపడింది. యాక్షన్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు. అదే టైమ్‌లో ఈ లవ్‌స్టోరీ ప్రపోజల్ వచ్చింది. ఆ సమయంలో మహేష్ ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. మహేష్ తప్పుకున్నంత ఈజీగా మంజుల వద్దనుకోలేకపోయింది. ఎందుకంటే ఈ లవ్‌స్టోరీలో వున్న ఫీల్ అలాంటిది మరి.
టైటిల్‌తో మాయ చేసినట్టే కథ కథనంతోనూ ఆడియెన్స్‌ను మాయ చేసే సినిమా. అదే ఏమాయ చేసావే. ప్రపంచంలో ఇంతముందున్నా నేను జెస్సీనే ఎందుకు లవ్ చేసాను అనే డైలాగ్ ఎవర్‌గ్రీన్ గా మిగిలిపోతుంది. మంజుల ఈ స్టోరీని మహేష్ తో చేయాలన్న ఉద్దేశ్యంతో డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో మహేష్‌కు స్టోరీ వినిపించారట. అయితే స్టోరీ బాగున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్షన్ మూవీ అయితే బెటర్.. అలాంటిది ప్లాన్ చేయండి ఖచ్చితంగా చేస్తానని చెప్పాడట మహేష్. సో అలా మహేష్ ఏమాయ చేసావే సినిమాను సున్నితంగా తిరస్కరించాడు. ఈ సినిమాతో చైతు, సమంత జోడీ కట్టారు. సమంత కు హీరోయిన్‌గా ఫస్ట్ ఫిల్మ్ అయితే, చైతు కు ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక సమంతకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి కూడా ఇది ల్యాండ్ మార్క్ మూవీ అయ్యింది.