Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. దానికి సంబంధించిన లుక్ లోనే ఇప్పుడు మహేశ్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా వర్క్‌షాప్‌లకు హాజరువుతున్నాడు మహేష్. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే.. లేటెస్ట్ గా మహేశ్ బాబు తన తనయుడి గౌతమ్ కాన్వకేషన్ కి హాజరయ్యారు. అక్కడ తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవడం పట్ల మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. గౌతమ్‌కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్ ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆకాంక్షించారు.

ఈ లేటెస్ట్ పిక్‌లో మహేష్ బాబు పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించారు. దీంతో ఆయన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి సినిమాలో కూడా ఇదే లుక్‌తో కనిపిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!