సూపర్ స్టార్ మహేశ్ బాబుకి తన తండ్రి కృష్ణ లాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన నటవారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి… తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పచుకొని.. అభిమాన గణాన్నీ భారీగా పెంచుకున్నాడు. హిట్టు తర్వాత హిట్టు తో మెట్టు మీద మెట్టు ఎక్కి.. ఇప్పుడు టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.

మహేష్ బాబుకు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆయనకి ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్ ఉన్నాయి. తాజాగా మహేష్ బాబు ట్విట్టర్‌లో మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. మహేష్ బాబును ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా 10 మిలియన్లు దాటింది. అనగా కోటి మంది మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారన్నమాట. ఈ ఘనత అందుకున్న ఏకైక సౌత్ హీరో మహేష్ బాబు కావడం విశేషం.

Leave a comment

error: Content is protected !!