Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తన కెరీర్ లో మరో మైలురాయిని చేరుకోనున్న సూపర్ స్టార్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా మేకోవర్ అయ్యి, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. సినిమా కోసం తాను పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇటీవల తన కుటుంబంతో న్యూయార్క్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్న మహేష్ బాబు, తాజాగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

ఆయన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు అండ్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో సంచలనం సృష్టించే అవకాశాలున్నాయి.

Leave a comment

error: Content is protected !!