శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘మ‌హాస‌ముద్రం’ ఆగ‌స్ట్ 19న విడుద‌ల కానున్న‌ది. అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లోనూ, ప్రేక్ష‌కుల్లోనూ అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. గురువారం, ఫిబ్ర‌వ‌రి 12 ఆయ‌న బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషెస్ తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ప్ర‌స్తుతం ‘మ‌హాస‌ముద్రం’ షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతోంది. 

ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చైత‌న్ భ‌రద్వాజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, ప్ర‌వీణ్ కె.ఎల్‌. ఎడిట‌ర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

తారాగ‌ణం:
శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్‌

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రిక‌పాటి
స‌హ నిర్మాత‌: అజ‌య్ సుంక‌ర‌
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కొల్లా అవినాష్‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌.
యాక్ష‌న్‌: వెంక‌ట్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్

Leave a comment

error: Content is protected !!