Misses Deshpandey : ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ తన తాజా ప్రాజెక్ట్‌తో మరోసారి ఆకట్టుకోబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటీమణి మాధురి దీక్షిత్‌ తో ‘మిసెస్ దేశ్‌పాండే’ అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఇందులో మాధురి సీరియల్ కిల్లర్ గా ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేయబోతోంది. ఈ సిరీస్ ఒక సిరీయల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి పోలీసులు మరో సిరీయల్ కిల్లర్‌ను ఎలా నియమిస్తారనే ఆసక్తికరమైన కథాంశంతో సాగుతుంది.

ఈ వెబ్ సిరీస్ ఒక ఫ్రెంచ్ సిరీస్‌కి రీమేక్ అని తెలుస్తోంది. భారీ స్థాయిలో ఈ రీమేక్‌ను రూపొందించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ‘మోడరన్ లవ్ హైదరాబాద్’ తర్వాత ఓటీటీ స్పేస్‌కి నగేష్ కుకునూర్ తిరిగి వస్తుండటం విశేషం. ఈ సిరీస్ గురించిన మరింత వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!