నటి నటులు: ఆర్. మాధవన్, సిమ్రాన్, సామ్ మోహన్, రజిత్ కపూర్, మిషా ఘోషల్, గుల్షన్ గ్రోవర్, మోహన్ రామన్, సూర్య,
సంగీతం: సామ్ సి. ఎస్.
ఛాయాగ్రహణం: సిర్షా రే
నిర్మాత: సరితా మాధవన్, ఆర్. మాధవన్, వర్గీస్ మూలాన్, విజయ్ మూలన్
రచన, దర్శకత్వం: ఆర్. మాధవన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ యొక్క ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కథ, నిర్మాత మరియు దర్శకత్వం వహించిన “R. మాధవన్” ప్రధాన పాత్రలో నటించారు. భారీ అంచనాలతో ఈ సినిమా “ప్యాన్ వరల్డ్” గా రీలిజ్ చేసారు. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం?
కథ: నంబి నారాయణన్(మాధవన్) ప్రతిభావంతుడు, అత్యద్భుతమైన గొప్ప “ఇస్రో సైంటిస్ట్”. సౌండింగ్ రాకెట్ & సాలిడ్ రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ రంగాలలో పని చేస్తుంటాడు. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ లో ద్రవ ఇంధన రాకెట్ “వికాస్ ఇంజిన్” ని వరల్డ్ వైడ్ గర్వించదగ్గ అత్యంత సామర్ధ్యంతో తీర్చిదిద్ది చరిత్రలోకి ఎక్కుతాడు “నంబి నారాయణన్”. అయ్యన భార్య మీనా నారాయణన్(సిమ్రాన్) తమ లైఫ్ హ్యాపీ గా సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి, “విమాన పరీక్ష డేటా”కు సంబంధించిన రహస్యాలు నంబి నారాయణన్(మాధవన్) గూఢచారి/దేశద్రోహి గా పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలతో అరెస్టు అయ్యి 50 రోజుల పాటు “జైలులో” చిత్ర హింసలు అనుభవిస్తాడు. పోలీస్ చిత్ర హింసలని ఎలా తట్టుకున్నాడు? ఆ చిత్ర హింసలో దేశ ప్రజల వళ్ళ తన ఫ్యామిలీ ఎలా సఫర్ అయ్యింది? తప్పుడు ఆరోపణలు అని ప్రపంచానికి తెలిసాక ఎలా ధైర్యంగా మళ్ళి ఇస్రో లో చరిత్ర తిరగరాయగలిగాడు అనేది కథ?
కధనం,విశ్లేషణ:
ఇస్రోలో విక్రం సారాభాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసిన మహా జ్ఞానీ నంబి నారాయణన్. తన ప్రతిభ ని మెచ్చి అమెరికా కి సంబందించిన నాసా లో ఉద్యోగం వచ్చిన, ఇండియన్ ఇస్రో కి పని చేసిన ఘనుడు. మొదటగా దేశం గర్వించదగ్గ సబ్జెక్ట్ ని ఎంచుకున్నందుకు ఆర్. మాధవన్ టీం కి “టెక్ ఏ బౌ”.
నంబి నారాయణన్ పాత్రలో ఆర్. మాధవన్ చూపించిన వేరియేషన్స్, యాక్టింగ్ అత్యద్భుతం. దేశం గర్వించదగ్గ సాధించిన పనులు స్క్రీన్ మీద చూపించిన విధానం అమోఘం అని చెప్పాలి. ముఖ్యంగా 50 రోజుల పాటు జైలులో చిత్ర హింసలు అనుభవించిన తీరు జనాలని కట్టిపడేస్తుంది. మాధవన్ కి భార్య గా నటించిన సిమ్రాన్ ఆమె కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే, ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో పేరు ప్రఖ్యాత పొందిన తన భర్త ని అన్యాయంగా అరెస్ట్ చేసి, ఇక చూడలేనేమో అనేంత గా జీర్ణించుకోలేక కుమిలిపోతుంటుంది. కోర్టు జామీన్ ఇచ్చిన తరువాత, తన భర్త జైలు నుంచి తిరిగి వచ్చిన సీక్వెన్స్ లో సిమ్రాన్ చేసిన నటన ప్రేక్షకులని భయపెట్టిస్తుంటుంది, ఎంతగానో ఏడిపిస్తుంది. దాదాపు నాలుగు సంవత్సరాలు తరువాత సుప్రీంకోర్టు నంబి నారాయణన్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
సినిమాలో నంబి నారాయణన్ తో సాగే సూర్య సీక్వెన్స్ – సూర్య నీల్ డౌన్ చేసి నంబి నారాయణన్ ని క్షమాపణ అడిగే సీనైతే మూవీకే హైలెట్..ఈ సీన్ ఎంతో ఎమోషనల్ గా సాగుతుంది.
గ్రాఫిక్ విజ్యువల్స్ విషయంలో ఇన్ డెప్త్ గా వెళ్లకపోయినప్పటికీ ఉన్నంతలో గ్రాండియర్ గా చేసారు. సినిమాలో ఎక్కడ బోర్ కొట్టకపోయిన, సైంటిస్ట్ లు వాడే టెర్మినాలిజీ ప్రేక్షకులకి అంతగా అర్ధం కాకపోవడం, కానీ ఒకటి కి రెండు సార్లు చూస్తే అర్ధమయ్యే అవకాశం కూడ ఉంది. కొన్ని చోట్ల సీన్స్ మీద ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.
“విమాన పరీక్ష డేటా”కు సంబంధించిన రహస్యాలు లీక్ చేసినట్టు తన పై స్పృష్టించిన తప్పుడు ఆరోపణలు ఎవ్వరు చేసారు? ఎందుకు చేసారు? అనేది నవంబర్ 30, 1994న నుంచి ఇప్పటి వరుకు సస్పెన్స్ గానే నడుస్తుంది.
నటి నటుల పెర్ఫామెన్స్: ఆర్. మాధవన్ నంబి నారాయణన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు. ఎన్నో ఎమోషన్స్ ని పండిస్తూ కథ ని తన భుజాల మీద వేసుకున్నాడు. సిమ్రాన్ తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్. సామ్ మోహన్, రజిత్ కపూర్, మిషా ఘోషల్, గుల్షన్ గ్రోవర్ తమ పాత్ర మేరకు బాగా రాణించారు. సూర్య స్పెషల్ అప్పీరియన్స్ కిక్ యాస్ అనే చెప్పాలి.
సాంకేతిక వర్గం:నంబి నారాయణన్(ప్రఖ్యాత శాస్త్రవేత్త) జీవిత చరిత్ర గురించి దేశ ప్రజలకి తెలియచేసినందుకు ఆర్. మాధవన్ టీం కి “టెక్ ఏ బౌ”. ఆర్. మాధవన్ సబ్జెట్ ని డీల్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. దర్శకుడి గా పాయింట్ ప్రేక్షకులకి కన్వే చేయడం లో సక్సెస్ అయ్యిన, అక్కడక్కడ కొన్ని సీన్స్ ఇంకా ఇంపాక్ట్ క్రేయేట్ చేసి ఉంటే బాగుండేది. మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి. ఎస్. బిజెఎం పర్వాలేదు అనిపించింది. ఛాయాగ్రహణం సిర్షా రే విజ్యువల్స్ అద్భుతంగా రాణించారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండ గ్రాండియర్ గా చేసారు.
రేటింగ్: 3.5/5
బాటమ్ లైన్: దేశం తలెత్తుకునేలా చేసిన సినిమా “రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్”