యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న  మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.  రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.

ఈ చిత్రం నుండి కృతి శెట్టిని స్వాతిగా పరిచయం చేస్తూ ఆమె  ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ట్రెండీ అవుట్ ఫిట్ తో స్టైలిష్‌గా కనిపించింది కృతి. ఆమె కూల్ గా కాఫీ ఆస్వాదించడం ప్లజంట్ గా వుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి కథానాయికగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా మరో కథానాయికగా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ ‘రారా రెడ్డి’లో సందడి చేస్తోంది. ఇటివలే  విడుదలైన  లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా,  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు.  

‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని అంజలి(స్పెషల్ సాంగ్) తదితరులు
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం:  ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల  
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్ : మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్

Leave a comment

error: Content is protected !!