Lucky Bhaskar : మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్‌ తెలుగులో మహానటి, సీతారామం, కల్కి చిత్రాల తర్వాత కథానాయకుడిగా నటిస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమాను సెప్టెంబర్ 7న విడుదల చేయాలనుకున్నారు కానీ, నిర్మాణనంతర పనులు పూర్తికావడానికి మరింత సమయం అవసరం కావడంతో సినిమా దీపావళి బరిలోకి దిగుతోంది.

ఈ చిత్రం 1980ల దశకం నేపథ్యంలో అప్పటి ముంబై నగరాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ మరియు సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు బంగ్లాన్, 1980ల దశకపు ముంబై నగరాన్ని తలపించే సెట్స్‌ను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు.

తెలుగుతో పాటు తమిళ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయించుకోవడం విశేషం. ప్రతి భాషకూ అనుగుణంగా అత్యంత శ్రద్ధతో డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం, దక్షిణ భారతీయ సినీ ప్రేక్షకులతో పాటు ఉత్తర భారతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అంచనా వ్యక్తమవుతోంది. జి.వి.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

Leave a comment

error: Content is protected !!