Love Mocktail 2 : కన్నడ చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ నిర్మాత, రచయిత, దర్శకుడు, హీరో అయిన డార్లింగ్ కృష్ణ నటించిన “లవ్ మాక్ట్ టైల్ 2” ఈ నెల 14న తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రానికి నకుల్ అభయాన్కర్ సంగీతం అందించాడు. డార్లింగ్ కృష్ణ గతంలో “జాకీ”, “మధరంగి”, “రుద్రతాండవ”, “చార్లీ” లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.

ఈ చిత్రంలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రల్లో నటించారు. డార్లింగ్ కృష్ణ నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించడమే కాకుండా హీరోగానూ నటించి మెప్పించాడు. కన్నడలో విడుదలైన “లవ్ మోక్టైల్”, “లవ్ మోక్టైల్ 2” సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఈ తెలుగు వెర్షన్‌ను కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!