Love Mocktail 2 movie review : డార్లింగ్ కృష్ణ రచన, దర్శకత్వం, నటనలో నటించిన లవ్ మోక్టైల్ 2, కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ కి కొనసాగింపుగా వచ్చింది. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
లవ్ మోక్టైల్ లో భార్య నిధిని కోల్పోయిన ఆది (డార్లింగ్ కృష్ణ), ఆమె గుర్తులతో బాధపడుతూ ఉంటాడు. డిప్రెషన్ నుంచి బయటపడటానికి అరకు ట్రిప్ వెళ్ళిన ఆది, తన భార్య తనతోనే ఉందని ఊహించుకుంటూ ఉంటాడు. అతని వెంట పడే అమ్మాయిలను పట్టించుకోని ఆది, మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ, బంధాలకు విలువనిచ్చే ఆది ఏం చేశాడు? చివరికి పెళ్లి చేసుకున్నాడా లేదా? అనేదే మిగతా కథ.
నటన:
గతంలో లవ్ మోక్టైల్ తో విజయం సాధించిన డార్లింగ్ కృష్ణ, ఈ సినిమాలో నిర్మాత, దర్శకుడు, హీరోగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో అతని నటన అద్భుతం. నిధి పాత్రలో మిలిన నాగరాజ్ నటన కూడా చాలా బాగుంది. రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్, అమృత అయ్యంగర్, సుస్మిత గౌడ, అభిలాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ విభాగం:
కన్నడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ, టెక్నికల్ విభాగం చాలా బాగా పనిచేసింది. నకుల్ అభయాన్కర్ అందించిన సంగీతం, పాటలు సినిమాకి హైలైట్. శ్రీ క్రేజీ మైండ్స్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చాలా బాగున్నాయి. దర్శకుడు డార్లింగ్ కృష్ణ మంచి కథ, దర్శకత్వ విలువలతో ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ ని ప్రేక్షకులకు అందించారు.
మొత్తం మీద, లవ్ మోక్టైల్ 2 ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ. డార్లింగ్ కృష్ణ నటన, దర్శకత్వం, నకుల్ అభయాన్కర్ సంగీతం సినిమాకి ప్రధాన బలాలు. కన్నడ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు.
ప్లస్ పాయింట్స్ : డార్లింగ్ కృష్ణ కథ, నటన
మిగిలిన నాగరాజ్, అభిలాష్, రచల్ డేవిడ్ క్యారెక్టర్స్
నకుల్ అభయాన్కర్ సంగీతం
సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ : ఫస్ట్ ఆఫ్ లో లాగ్ సీన్స్
రేటింగ్ : 3/5
నటీనటులు :
డార్లింగ్ కృష్ణ, మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్
టెక్నికల్ టీం :
నిర్మాణం : కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్
రచన , దర్శకత్వం : డార్లింగ్ కృష్ణ నిర్మాత : ఎం వి ఆర్ కృష్ణ
మ్యూజిక్ : నకుల్ అభయాన్కర్
లిరిసిస్ట్ : గురు చరణ్
మ్యూజిక్ లేబుల్ : జాంకర్ మ్యూజిక్
డిఓపి & ఎడిటర్ : శ్రీ క్రేజీ మైండ్స్
కథ మరియు దర్శకత్వం : డార్లింగ్ కృష్ణ
పి ఆర్ ఓ : మధు VR