Love me movie: ‘రౌడీ బాయ్’ ఆశిష్ రెడ్డి, ‘బేబీ’ గాళ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ “లవ్ మీ”. ఈ సినిమా మే 25, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ఒక దెయ్యంతో హీరో ప్రేమలో పడతాడు. దెయ్యం పాత్రలో ఎవరు నటించారనే విషయాన్ని చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు.

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. తాజాగా, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఒక కొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది.  అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అనేక ఆశ్చర్యకరమైన అంశాలు ఉన్నాయని చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.

Leave a comment

error: Content is protected !!