Shopping Cart 0 items - $0.00 0

యన్టీఆర్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్

 

విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు. ఎన్నో రికార్డ్స్ ని తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో క్రియేట్ చేసాడు. కొన్ని రికార్డ్స్ మాత్రం అసాధ్యం అని అనిపించ‌క‌మాన‌దు. బ్రేక్ చేయ‌డం ఎవ‌రి త‌రం కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 1962 లో దాదాపు 32 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ప‌న్నెండు సినిమాలు ఎన్టీఆర్‌వే కావ‌డం విశేషం. అంతే కాదు ఈ ప‌న్నెండు చిత్రాల్లో తొమ్మిది సూప‌ర్ హిట్స్ కావ‌డం మ‌రో విశేషం. నాదీ ఆడ‌జ‌న్మే, పాండ‌వ వ‌న‌వాసం, మంగ‌మ్మ శ‌ప‌థం, తోడూ నీడా, దేవ‌త‌, వీరాభిమ‌న్యు, సిఐడి, ఆడ‌బ్ర‌తుకు చిత్రాలు హండ్రెడ్ డేస్‌ని సెల‌బ్రేట్ చేసుకోగా దొరికితే దొంగ‌లు చిత్రం మాత్రం 92 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైంది. మొత్తం మీద ఒక సంవ‌త్స‌రంలో ప‌న్నెండు చిత్రాల్లో యాక్ట్ చేయ‌డం ఒకెత్త‌యితే.. ఇందులో డైరెక్ట్ 8 సినిమాలు వంద‌రోజులాడ‌టం మ‌రో ఎత్తు. మ‌రి ఇలాంటి అరుదైన రికార్డ్ ని ఇండియాలో మ‌రే హీరో అయినా బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశం వుందా. ?

Leave a comment

error: Content is protected !!