Shopping Cart 0 items - $0.00 0

మిడతలదాడిని ముందే చూపించిన సూర్య ‘కాప్పాన్ ’ చిత్రం

 

ఒక పక్క ప్రపంచ దేశాలు కంటికి కనిపించని కరోనా వైరస్ తో  యుద్ధం చేస్తుంటే.. మరో పక్క పంటపొలాలు నాశనం చేస్తూ..  భారత్ లోని  రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు. మరీ ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో వీటి ప్రభావం ఎక్కువ గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య నటించిన కాప్పాన్ చిత్రం పరాజయం పాలైనా.. నెట్టింట్లో ఇప్పుడు వైరల్ గా మారింది.

కే.వీ. ఆనంద్ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా, మోహన్ లాల్ ప్రధానమంత్రిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కాప్పాన్’. తెలుగులో ఈ సినిమా బందోబస్త్ పేరుతో విడుదలైంది. ఈ సినిమా ద్వితీయార్ధంలో బోమన్ ఇరానీ.. ఒక ప్రాంతంలో మైనింగ్ పరిశ్రమ నెలకొల్పడం కోసం ఆ ప్రదేశంలోని పంటపొలాల్ని నాశనం చేయడానికి మిడతల దండు ను ప్రయోగిస్తాడు. దీంతో పంటపొలాలన్నీ నాశనమై.. రైతులు తీవ్ర సమస్యను ఎదుర్కొంటారు. విషయం తెలుసుకొన్న హీరో సూర్య రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తాడు. దీంతో భారత్ లో మిడతలదండు ప్రభావానికి లోనైన కొన్ని ప్రాంతాలతో .. బందోబస్త్ కు సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం మనం ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో.. దాన్ని రెండేళ్ళక్రితం దక్షిణాది సినిమాలో చూపించారనే కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా.. సూర్య నటిచింన 7th  సెన్స్ లోని వైరస్ కు, కరోనా వైరస్ కు లింక్ చేస్తూ..  దీన్ని కూడా సూర్య తన చిత్రంలో ముందే చూపించాడని సోషల్ మీడియాలో ఫోటోస్ పెట్టి సందడి చేస్తున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!