నటీనటులు–

బేబి నేహ, బేబి ప్రణతిరెడ్డి, మాస్టర్‌ వేదాంత్‌ వర్మ,

రాజ్‌వీర్, మిచెల్‌ షా, రాజీవ్‌ పిళ్లై,  శివకృష్ణ తదితరులు..

బ్యానర్‌– గోపురం స్టూడియోస్‌

నిర్మాతలు– కె.బాబురెడ్డి, సతీష్‌ కుమార్‌.జి

సంగీతం– ఆంటో ఫ్రాన్సిస్‌

కథ– దర్శకత్వం– శివమ్‌

లిల్లీ.. ఇదో పాన్ ఇండియా సినిమా.. స్టార్స్ సూపర్‌స్టార్స్ లేరు ఇందులో. ఉన్నది కొత్త యాక్టర్స్‌, చిన్న పిల్లలు. అయినా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ చేయడమేంటి అనే ఆసక్తి కలిగించారు. లిల్లీ అనే ఓ చిన్న పాప మెయిన్‌లీడ్‌తో శివమ్‌ డైరెక్షన్‌లో బాబురెడ్డి, సతీష్‌ కుమార్‌లు నిర్మించిన ఈ సినిమా కథేంటి ? అనుకున్నట్టే అందరినీ ఆకట్టుకుందా ఈ రివ్యూలో చూద్దాం.

కథ :  లిల్లీ (బేబీ నేహ) ఫ్రెండ్ దివ్య (బేబీ ప్రణతి రెడ్డి) కు సినిమా ఓపెనింగ్‌లోనే క్యాన్సర్‌ అనే విషయంతో సినిమా స్టార్ట్ అవుతుంది. దివ్య క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్ కు చాలా డబ్బు అవసరమవుతుంది. దివ్య మేనమామ దేవా (రాజ్‌వీర్‌)  దగ్గర అంత డబ్బు ఉండదు. తన ఫ్రెండ్ దివ్య ట్రీట్‌మెంట్‌ కోసం మరో ఫ్రెండ్‌ వేదాంత్‌ తో కలిసి లిల్లీ ఏం చేసింది ? దివ్య క్యాన్సర్‌ నయమవుతుందా ? అనేది వెండితెరపై చూడాల్సిందే.

కథనం – విశ్లేషణ :

క్యాన్సర్‌ సర్వైవల్‌ పాయింట్ అనేది చాలా ఎమోషనల్‌ టచ్ ఉన్న సబ్జెక్ట్‌.  క్యాన్సర్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు ఆడియెన్స్‌ను ఎమోషనల్‌గా పీక్‌ స్టేజ్‌ కు తీసుకెళ్లి ఆకట్టుకున్నాయి. అలాంటి సబ్జెక్టే ఈ లిల్లీ. దివ్య మేనమామ పాప ట్రీట్‌మెంట్ కోసం అందిన కాడికి అప్పులు చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటాడు. అయినా పూర్తిగా డబ్బు సమకూరదు. పసిప్రాయంలో ఉండే స్నేహంలో ఎంత స్వచ్చత ఉంటుందో లిల్లీ క్యారెక్టర్‌లో కనిపిస్తుంది. అవసరమైన సమయంలో స్నేహం ఎలాంటి కష్టనష్టాలకైనా ఓర్చుతుంది.. దానికి వయసుతో పనిలేదని ప్రూవ్ చేసేలా కథ సాగుతుంది.  ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో క్యాన్సర్ అంటే ఏంటో.. ఎంత భయంకరమైన జబ్బో తెలియకపోయినా తన ఫ్రెండ్‌ కోసం లిల్లీ చేసే ప్రయత్నంలో స్వచ్చత పవిత్రత ఉంటాయి. మనస్పూర్తిగా ప్రయత్నిస్తే…ప్రకృతి, ప్రపంచం రెండూ అనుకూలిస్తాయని లిల్లీ క్యారెక్టర్‌ ద్వారా చెప్పాడు దర్శకుడు. జబ్బు ఇచ్చిన దేవుడే డబ్బు ఎందుకు ఇవ్వడు అని అమాయకంగా అడిగే లిల్లీ ప్రశ్నకు నివ్వెరపోవడం తప్ప ఆన్సర్‌ దొరకదు. ఇలాంటి సెన్సిటివ్ పాయింట్స్‌ని ఓ చిన్న పిల్లలు పిల్లర్స్‌ గా ఉన్న కథలో ఇమడ్చడం ద్వారా ఎమోషనల్‌ గా టచ్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు దర్శకుడు శివమ్‌.

టెక్నిషియన్స్ పనితీరుః

ఐదుభాషల్లో పాన్‌ఇండియా చిల్డ్రన్‌ సినిమాగా విడుదలవుతున్న ‘లిల్లీ’ సినిమాను  సినిమాను చూస్తున్నంతసేపు దర్శకుడు శివమ్‌ తన మొదటి చిత్రాన్నే ఇంతటి ఎమోషనల్‌ పాయింట్‌ను ఎందుకు ఎంచుకున్నాడో అనిపిస్తుంది. ఈ చిన్నపిల్లల కథలో అంత డెప్తు ఉంది మరి. అలాగే చిన్నపిల్లల స్నేహం ఎంత పవిత్రంగా ఉంటుందో చూపించే ప్రయత్నాన్ని విజయవంతంగా చూపించాడు దర్శకుడు శివమ్‌.

ప్లస్‌పాయింట్స్:

చిన్నపిల్లల ఎమోషన్‌

ఫోటోగ్రఫీ

వాగ్దేవి పాడిన రెండు పాటలు

మైనస్‌ పాయింట్స్‌ :

సినిమా మొత్తం స్లోగా ఉండటం

అందరూ కొత్త యాక్టర్స్ కావడం

శివకృష్ణ లాంటి సీనియర్‌ యాక్టర్స్ ని సరిగ్గా వాడుకోకపోవడం

బాటమ్‌లైన్‌–

లిల్లీ.. పిల్లలతో పిల్లలకోసం పిల్లలు మాత్రమే మెచ్చే సినిమా

రేటింగ్‌–: 2.75 /5

Leave a comment

error: Content is protected !!