మూవీ: లైగర్
నటి నటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మైక్ టైసన్ తది తరులు…  
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
సంగీతం: సునీల్ కశ్యప్, విక్రమ్ మ్యాంట్రోస్, తనీష్ భాగ్చి
రచన దర్శకత్వం: పూరి జగన్నాధ్
బ్యానర్: పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 25-08-2022

విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్స్ తరువాత పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ప్యాన్ ఇండియా స్థాయిలో రీలిజ్ అయ్యిన సినిమా “లైగర్”. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఇప్పటి వరుకు ఒక్క సినిమా చేయకపోయినా, విజయ్ కి మాత్రం ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. విజయ్ కి జోడి గా “అనన్య పాండే” హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మైక్ టైసన్ ముఖ్య పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్ & ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ, ఈ వారం థియేటర్ లో విడుదలైనది. మరి ఈ కధంటో తెలుసుకుందాం?

కథ:
“చాయ్ బిజినెస్” చేసుకొనే బాలామణి (రమ్య కృష్ణ) ఆమె కుమారుడు లైగర్ (విజయ్ దేవరకొండ). త‌న కొడుకుని మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్.ఎమ్.ఎ) కి ఫైటర్ గా చూడాలనుకుంటుంది. తన భర్త కూడ ఒక ఫైటర్. కానీ, డబ్బులు పెట్టి నేర్పించే స్థోమత లేకపోవడంతో “రోనిత్ రాయ్” (కోచ్) హెల్ప్ తీసుకుంటుంది. విజయ్ లో ఉన్న టాలెంట్ ని చూసి రోనిత్ రాయ్ కోచింగ్ ఇస్తాడు. ఒక రోజు తాన్యా (అనన్య పాండే) పరిచయం కాస్త, బ్రేక్ అప్ అవ్వుతుంది. ఆ బాధలో ఉన్న విజయ్ నేషనల్ ఛాంపియన్ కాస్త, ఇంటర్నేషనల్ చాంపియన్ ఎలా అయ్యాడు? దానికి వెనక ఉన్న కారణం ఎవ్వరు? బాలామణి వెనుక కథ ఏమిటి? అసలు ఎందుకు బ్రేకప్ అయ్యారు అనేది కథ?

కథనం, విశ్లేషణ:
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు తెలుగు లో భద్రాచలం, తమ్ముడు సినిమాలు హిట్ అయ్యిన, కొత్తదనం లేకపోతే ఫ్లాప్ అయ్యిన సినిమాలు కూడ ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి రేంజ్ లో ఉందో తెలుసుకుందాం?

సినిమాలో మునుపెన్నడు చూడని విధంగా విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ చూస్తాం. ముఖ్యంగా, థియేటర్ లో విజయ్ దేవరకొండ బాడీ కి అమ్మాయిలు ఫిదా అవ్వలిసిందే. అంతే కాదు, డ్యాన్స్ మూమెంట్స్, ఫైట్ సీక్వెన్స్ లు విజయ్ చేస్తుంటే సగటు ప్రేక్షకుడికి కనువిందు గా ఉంటుంది. సినిమా ఓపినింగ్ లో విజయ్ నత్తి క్యారెక్టర్ లో జీవిస్తూ, ఫైట్ తో అదరకొడతాడు. ఎమ్.ఎమ్.ఎ లో ట్రైనింగ్ తీసుకుంటున్న  గెటప్ శీను క్యారెక్టర్ కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా ట్రైనింగ్ భాగంలో విజయ్ కి & గెటప్ శీను కి జరిగే ఫైట్ అందరికని ఎంటర్టైన్ చేస్తుంది. ఇకపోతే, అలీ కామిడి పెద్దగా ఆకట్టుకోక పొయ్యిన పర్వాలేదు అనిపించింది. అమ్మ గా నటించిన రమ్య కృష్ణ పాత్ర అద్భుతంగా ఉంటుంది, కన్న కొడుకుని దారిలో పెట్టడానికి ఆవిడ చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు.

ట్రైనింగ్ లో విజయ్ ని చూసి అనన్య పాండే కి నచ్చడం. ఇద్దరి మధ్య జరిగే లవ్ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోకపోవడం. ఇలాంటివి ఉన్న, అనన్య పాండే & విజయ్ పెర్ఫామెన్స్ తో థియేటర్స్ లో ఆడియెన్స్ ని నిలబెడుతుంది. ఎప్పుడైతే అనన్య పాండే తో బ్రేకప్ అవ్వుతుందో సినిమా కొంచెం సీరియస్ మ్యాటర్ లోకి వెళ్తుంది.

అనన్య పాండే కి అన్నయ గా నటించిన విషు బాగానే ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో విజయ్ కి పోటా పోటీ గా అనిపించాడు.  ప్రథమార్ధం బాగానే ఆకట్టుకున్న ద్వితీయార్థం కాస్త స్లో గా ఉండటం. కథలో కొత్తదనం లేకపోవడం. సినిమాలో కొన్ని సీన్స్ కంటిన్యూటీ లేకపోవడం. విజయ్ నేషనల్ చాంపియన్ నుంచి ఇంటర్నేషనల్ చాంపియన్ గా పోటీ పడే సన్నివేశాలు సాదా సీదా గా అనిపిస్తాయి. మైక్ టైసన్ అండ్ విజయ్ కి మధ్య జరిగే ఫైటింగ్ సన్నివేశాలు చాలా కామెడీ గా అనిపిస్తాయి.

నటి నటులు పెర్ఫామెన్స్: విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్. రమ్యకృష్ణ తల్లిగా ప్రేక్షకులని ఎమోషన్స్ తో కట్టిపడేస్తుంది. అనన్య పాండే అంద చందాలతో ఆకట్టుకుంటుంది. మైక్ టైసన్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. రోనిత్ రాయ్, విషు తది తరులు తమ పరిధి మేరకు బాగానే రాణించారు.

సాంకేతిక విభాగం: విజయ్ దేవరకొండ హీరోయిజం ని చూపించడంలో పూరి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కాకపోతే, స్టోరీ మీద శ్రద్ధ పెట్టాలిసింది. డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం మైనస్ అని చెప్పచ్చు. మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్, విక్రమ్ మ్యాంట్రోస్, తనీష్ భాగ్చి బ్యాగ్రౌండ్  పరంగా పర్వాలేదు అనిపించింది. జునైద్ సిద్దిఖీ  ఎడిటింగ్ లో ఇంకొంచెం పదును పెట్టి ఉంటె బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా ఉన్నాయి.    

రేటింగ్:  3/5

బాటమ్ లైన్: వన్ మ్యాన్ షో  “లైగర్” 

Leave a comment

error: Content is protected !!