హాట్ టాపిక్ గా మారుతూ అరుదైన లీగల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న మూవీ ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా ఈ సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్ష‌న్‌ను హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ.. “నాకు ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. క‌రోనా టైమ్‌లో పాడ్ కాస్ట్ చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఓ మంచి సినిమా చేద్దాం అనుకుని, లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్ర చేయ‌డం సుల‌భంగా అనిపించింది. ఇంత వరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు.” అని అన్నారు.

రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నామ‌ని చెప్పారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. డిసెంబ‌ర్ 27 ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలిపారు.

ఇక ద‌ర్శ‌కుడు రవి మాట్లాడుతూ.. “వీర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపించింది. అరుదైన సబ్జెక్టు. మా సినిమాను మీడియాతో పాటు ప్రేక్ష‌కులు ఆద‌రించాలి.” అని కోరారు.

డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ చౌదరి మాట్లాడుతూ.. “టీజర్ కు మంచి బజ్ వచ్చింది. మేము ఈ సినిమాను 70 థియేటర్లలో విడుదల చేస్తున్నాం.

డైరెక్టర్ రవి గోగుల మాట్లాడుతూ.. అందరు చూడదగిన సినిమా. వీర్ రెడ్డి చాలా నాచురల్ గా చేశారు. ప్రతి సీన్ మన కళ్ళ ముందే జరిగినట్టు ఉంటుంది. మన చుట్టూ జరిగే వాస్తవిక సంఘటనలా ఉంటుంది.

ప్రొడ్యూసర్ శాంతమ్మ మలికిరెడ్డి మాట్లాడుతూ.. “ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకం. లా సబ్జెక్టుపై అరుదైన సినిమా తీసుకు వస్తున్నాం. ఈ నెల 27న విడుదలయ్యే ఈ సినిమాను అందరు ఆదరించాలని కోరుకుంటున్నాం.” అని అన్నారు.

Leave a comment

error: Content is protected !!